
సర్జరీ జరిగిన 15 రోజుల తర్వాత భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు. శస్త్ర చికిత్స అనంతరం ఓ ఫోటోను షేర్ చేశాడీ టీమిండియా స్టార్ పేసర్. ఆ తర్వాత మరోసారి తన హెల్త్ అప్‌డేట్ ఇచ్చాడు. ఇప్పుడు చికిత్స ప్రక్రియ తదుపరి దశ కోసం ఎదురు చూస్తున్నానని మహ్మద్ షమీ తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌లో 24 వికెట్లు తీసిన మహ్మద్ షమీ.. గాయం కారణంగా ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో కూడా ఆడలేదు. అతను గత నెలలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీని కారణంగా అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడలేకపోయాడు. ఇదిలాఉంటే ఐపీఎల్ 2024తో పాటు ఇదే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో షమీ ఆడలేడని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇటీవల తెలిపారు. షమీ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగే దేశవాళీ టెస్టు సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తాడు. ప్రపంచకప్ తర్వాత బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే ఈ టెస్టు సిరీస్‌లోనే షమీ బంతి అందుకుంటాడని జైషా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సర్జరీ తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చే ఫోటోను షేర్ చేశాడు మహ్మద్ షమీ.’ నా గాయం గురించి అప్‌డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆపరేషన్ చేసి 15 రోజులు కావస్తోంది. నా కుట్లు తొలగించారు’ అని ట్వీట్ చేశాడు షమీ. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. షమీ త్వరగా కోలుకోవాలని, మళ్లీ భారత జట్టులోకి అడుగుపెట్టాలని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌ల్లో షమీకి ప్లేయింగ్-11లో చోటు దక్కలేదు. అయితే హార్దిక్ పాండ్యా గాయపడడంతో షమీకి అవకాశమొచ్చింది. అంచనాలకు మించి రాణించి ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అయితే ఆ తర్వాత చీలమండ గాయం కావడంతో క్రికెట్ కు దూరమయ్యాడు. షమీతో పాటు మరో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్‌లో ఆడలేరని భారత క్రికెట్ బోర్డు ఇటీవలే స్పష్టం చేసింది.
“Grateful to be back in India after surgery. Feeling stronger and ready to embrace this next chapter. Thank you to everyone for your support and love! 🇮🇳💪 #RoadToRecovery #Gratitude #India” #mdshami #mdshami11 #shami pic.twitter.com/jvON4vEuU7
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) March 14, 2024
Hello everyone! I wanted to provide an update on my recovery progress. It has been 15 days since my surgery, and I recently had my stitches removed. I am thankful for the advancements I have achieved and looking forward to the next stage of my healing journey. 🙌 pic.twitter.com/wiuY4ul3pT
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) March 13, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..