Watch Video: వామ్మో.. ఇదేం త్రో సిస్టర్.. షాక్‌లో బ్యాటర్స్.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..

Harleen Deol: హర్లీన్ డియోల్ వేసిన ఈ త్రోను బ్యాటర్‌తో సహా గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లు నమ్మలేకపోయారు. బౌండరీ నుంచి వికెట్లను పడగొట్టడంతో అంతా అవాక్కయ్యారు.

Watch Video: వామ్మో.. ఇదేం త్రో సిస్టర్.. షాక్‌లో బ్యాటర్స్.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..
Harleen Deol Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Mar 15, 2023 | 8:18 AM

మహిళల ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో గుజరాత్ జెయింట్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌కు 163 పరుగుల విజయ లక్ష్యం ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్‌ తరపున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 30 బంతుల్లో 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమె ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా హర్లీన్ డియోల్ త్రో..

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో, హుమైరా కాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తుంది. బంతి అన్నాబెల్ సదర్లాండ్ చేతిలో ఉంది. అయితే, హర్మన్‌ప్రీత్ కౌర్ మిడ్-ఆన్ బౌండరీ వైపు షాట్ ఆడింది. కానీ, హర్లీన్ డియోల్ నేరుగా బౌండరీ నుంచి వికెట్లను గురి చూసి కొట్టింది. దీంతో బ్యాటర్‌కు పెవిలియన్ దారి చూపించింది. హర్లీన్ డియోల్ వేసిన ఈ త్రో బ్యాటర్‌తో సహా గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లు కూడా నమ్మలేకపోయారు. షాక్‌లోనే హుమైరా కాజీ పెవిలియన్‌ చేరింది. ఎందుకంటే ఆ సమయంలో హుమైరా కాజీ క్రీజులో లేదు.

ఇవి కూడా చదవండి

దుమ్మురేపుతోన్న ముంబై..

అయితే, హర్లీన్ డియోల్ విసిరిన త్రో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదే సమయంలో అభిమానులు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ఇది కాకుండా, సోషల్ మీడియాలో నిరంతరం వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఉన్న జట్టు నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. గుజరాత్ జెయింట్స్ గురించి చెప్పాలంటే, ఈ జట్టు ప్రదర్శన ఇప్పటివరకు నిరాశపరిచింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో, గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు కేవలం ఒక విజయం మాత్రమే సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..