IND vs AUS: అయ్యర్ స్థానంలో శాంసన్‌కు చోటు? ప్లేయింగ్ XIలో ఆడేది మాత్రం మరో యంగ్ ప్లేయర్.. ఎందుకంటే..
Shreyas Iyer: ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు.
అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడటంతో భారత క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయ్యర్‌కు వెన్ను గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. దీని తర్వాత, అతను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు వన్డే సిరీస్‌లో అయ్యర్ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ప్రశ్నగా నిలిచింది. ఇందులో ఒక పేరు ఫ్యాన్స్‌కు సంతోషాన్ని అందిస్తోంది. ఆ పేరే వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజు శాంసన్. మీడియా నివేదికల ప్రకారం, సంజు శాంసన్ అయ్యర్‌ను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఐపీఎల్ నుంచి ఔట్..
అయ్యర్ గాయం చాలా తీవ్రంగా ఉంది. అతను ఐపీఎల్ నుంచి కూడా నిష్క్రమించవచ్చని తెలుస్తోంది. ఈ లీగ్‌లో అతను కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్నాడు. జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయ్యర్ గాయంతో కోల్‌కతా కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు అయ్యర్ స్థానంలో కెప్టెన్ ఎవరన్నదే ఫ్రాంచైజీ ముందున్న ప్రశ్నగా నిలిచింది.
సంజుకి అవకాశం వస్తుందా?
అయ్యర్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడనే వార్త వెలుగులోకి రాగానే.. అతని స్థానంలో సంజూ శాంసన్ వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోవచ్చని మీడియా నివేదికల్లో వెలువడుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు మార్చి 14న ఇంగ్లీష్ వార్తాపత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, సీనియర్ సెలక్షన్ కమిటీ అయ్యర్‌ను వన్డే సిరీస్ నుంచి తప్పించింది. అయ్యర్ స్థానంలో ఎవరినీ రీప్లేస్ చేయలేదు. మరి ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా ఏం చెబుతుందో చూడాల్సి ఉంది.
న్యూజిలాండ్ పర్యటన తర్వాత శాంసన్ వన్డే జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతను శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ, మోకాలి గాయం కారణంగా అతను ఈ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అప్పటి నుంచి మళ్లీ పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
కెప్టెన్‌గా పాండ్యా..
మార్చి 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడనుండగా, తొలివన్డేలో మాత్రం ఆడడం లేదు. తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే, రోహిత్ తదుపరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. మిగతా రెండు వన్డేలకు రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయ్యర్ నిష్క్రమణ తర్వాత, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్-11లో అతని స్థానంలోకి రావడానికి బలమైన పోటీదారుగా పరిగణిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..