AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs KKR, IPL 2023 Highlights: ఐదు వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం.. సత్తా చాటిన ఇషాన్, సూర్య..

Mumbai Indians vs Kolkata Knight Riders IPL 2023 Highlights in Telugu: ముంబై జట్టు IPL-2023లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు ఓడిపోయింది. కోల్‌కతా నాలుగింటిలో రెండు గెలిచి, రెండు ఓడిపోయింది.

MI vs KKR, IPL 2023 Highlights: ఐదు వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం.. సత్తా చాటిన ఇషాన్, సూర్య..
Mi Vs Kkr Live
Venkata Chari
|

Updated on: Apr 16, 2023 | 7:32 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్-16 మూడో సూపర్ సండే తొలి మ్యాచ్ 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య వాంఖడే స్టేడియంలో ప్రారంభం అయింది. రోహిత్ స్థానంలో టాస్‌కు వచ్చిన సూర్యకుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ జట్టులోకి తిరిగి వచ్చాడు. కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేస్తున్నాడు.

ఇరు జట్లు..

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(కీపర్), కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, ఎన్ జగదీసన్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ శర్మ, డేవిడ్ వైస్, అనుకుల్ రాయ్, మన్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా.

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: రోహిత్ శర్మ, రమణదీప్ సింగ్, అర్షద్ ఖాన్, విష్ణు వినోద్, కుమార్ కార్తికేయ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 16 Apr 2023 07:32 PM (IST)

    5 వికెట్ల తేడాతో ముంబై విజయం..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్-16 మూడో సూపర్ సండే తొలి మ్యాచ్ లో వాంఖడే మైదానంలో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది. KKRపై MIకి ఇది 23వ విజయం. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు జరిగాయి. ప్రస్తుత సీజన్ గురించి చెప్పాలంటే, ముంబైకి ఇది వరుసగా రెండో విజయం. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 8వ స్థానంలో ఉంది.

  • 16 Apr 2023 07:04 PM (IST)

    15 ఓవర్లలో ముంబై స్కోర్..

    ముంబై ఇండియన్స్ 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్, టిమ్ డేవిడ్ ఉన్నారు.

  • 16 Apr 2023 06:38 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ముంబై..

    ముంబై ఇండియన్స్‌ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. సూర్యకుమార్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 58 పరుగులు) 13వ అర్ధ సెంచరీ చేసిన తర్వాత ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అవుటయ్యాడు. అంతకుముందు రోహిత్ శర్మ 20 పరుగుల వద్ద అవుటయ్యాడు.

  • 16 Apr 2023 06:15 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ముంబై..

    ముంబై ఇండియన్స్ 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు. కిషన్ 13వ అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

    20 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. సుయాష్ బౌలింగ్ లో ఉమేష్ యాదవ్ చేతికి చిక్కాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ 29 బంతుల్లో 65 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. సీజన్‌లో మొదటిసారిగా, ఒక జట్టు రెగ్యులర్ కెప్టెన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ కోసమే కెప్టెన్‌గా వచ్చాడు.

  • 16 Apr 2023 06:04 PM (IST)

    దూకుడు పెంచిన ముంబై ఓపెనర్లు..

    ముంబై ఇండియన్స్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది.

  • 16 Apr 2023 05:28 PM (IST)

    ముంబై టార్గెట్ 186..

    వెంకటేష్ అయ్యర్ తుఫాన్ సెంచరీ ఆధారంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆతిథ్య ముంబై ఇండియన్స్‌కు 186 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. ముంబైలోని వాంఖడే మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది.

  • 16 Apr 2023 04:52 PM (IST)

    14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్..

    కోల్ కతా 14 ఓవర్లలో నాలుగో వికెట్ కు 135 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్ క్రీజులో ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ తన కెరీర్‌లో 7వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను ఇప్పటివరకు 7 సిక్సర్లు సాధించాడు. ఐపీఎల్‌లో తొలి సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.

  • 16 Apr 2023 04:31 PM (IST)

    10 ఓవర్లకు కేకేఆర్ స్కోర్..

    కోల్‌కతా 10 ఓవర్లలో మూడు వికెట్లకు 90 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ కెరీర్‌లో 7వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.

    5 పరుగుల వద్ద కెప్టెన్ నితీష్ రాణా ఔటయ్యాడు. అంతకుముందు రెహమానుల్లా గుర్బాజ్ 8 పరుగుల వద్ద, నారాయణ్ జగదీషన్ 0 పరుగులకే పెవిలియన్ చేరారు.

  • 16 Apr 2023 04:10 PM (IST)

    6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్..

    కోల్‌కతా 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. చావ్లా బౌలింగ్‌లో గుర్బాజ్ పెవిలియన్ చేరాడు.

  • 16 Apr 2023 03:59 PM (IST)

    జోరు పెంచిన కేకేఆర్ ప్లేయర్స్..

    కోల్‌కతా 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 03:48 PM (IST)

    జూనియర్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 24..

    అర్జున్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 24తో బరిలోకి దిగాడు. ఏప్రిల్ 24న సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. అర్జున్ తన జెర్సీ నంబర్‌ను తన తండ్రికి అంకితం చేశాడు.

  • 16 Apr 2023 03:44 PM (IST)

    2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్..

    కోల్‌కతా రెండు ఓవర్‌లో ఒక వికెట్ కోల్పోయి 12 పరుగులు చేసింది. గ్రీన్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్ అద్భుత క్యాచ్ పట్టడంతో జగదీషన్ పెవిలియన్ చేరాడు.

  • 16 Apr 2023 03:36 PM (IST)

    MI vs KKR: అరంగేట్ర ఓవర్ అదరగొట్టిన అర్జున్..

    తొలి ఓవర్ ముగిసే సరికి కేకేఆర్ టీం వికెట్ నష్టపోకుండా 5 పరుగులు పూర్తి చేసింది. గుర్బాజ్, జగదీషన్ క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 03:15 PM (IST)

    MI vs KKR: రోహిత్ ఔట్..

    కేకేఆర్ తో తలపడేందుకు సిద్ధమైన ముంబై టీంలో కీలక మార్పులు వచ్చాయి. కెప్టెన్ గా సూర్య కుమార్ ఎంట్రీ ఇవ్వగా, గాయంతో రెగ్యులర్ సారథి రోహిత్ తప్పుకున్నాడు. అలాగే సచిన్ తనయుడు అర్జున్ నేటి మ్యాచ్ లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు.

  • 16 Apr 2023 03:13 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI..

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, ఎన్ జగదీసన్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.

  • 16 Apr 2023 03:10 PM (IST)

    ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI..

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(కీపర్), కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్.

  • 16 Apr 2023 03:05 PM (IST)

    MI vs KKR: టాస్ గెలిచిన ముంబై..

    టాస్ గెలిచిన ముంబై టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, కెప్టెన్ గా హిట్ మ్యాన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ టాస్ కు వచ్చి షాకిచ్చాడు.

  • 16 Apr 2023 02:17 PM (IST)

    MI vs KKR: గెలుపు ఎవరిదో..

    ముంబై ఇండియన్స్ తన సొంత మైదానంలో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సొంత మైదానంలో ప్రతి జట్టు బలంగానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ మ్యాచ్‌లో ముంబైదే పైచేయిగా నిలవనుంది. కానీ కోల్‌కతాను కూడా తేలికగా తీసుకోలేం. ఎందుకంటే ఈ జట్టు గత కొన్ని మ్యాచ్‌లలో సత్తా చాటుతూ, విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకపోతోంది.

Published On - Apr 16,2023 2:15 PM