MI vs CSK Highlights IPL 2022: ధోని మెరుపు ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో చెన్నై విజయం..

Narender Vaitla

| Edited By: Basha Shek

Updated on: Apr 22, 2022 | 12:07 AM

Mumbai Indians vs Chennai Super Kings Highlights  in Telugu: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో ముంబై ఇండియన్స్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో  రోహిత్ సేనకు ప్లే ఆఫ్ అవకాశాలు  దాదాపు ముగిసినట్లే.

MI vs CSK Highlights IPL 2022: ధోని మెరుపు ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో చెన్నై  విజయం..

Mumbai Indians vs Chennai Super Kings Highlights  in Telugu: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో ముంబై ఇండియన్స్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో  రోహిత్ సేనకు ప్లే ఆఫ్ అవకాశాలు  దాదాపు ముగిసినట్లే. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన ముంబై పాయింట్ల జాబితాలో చివరి స్థానంలో నిలిచింది.  కాగా ముంబై లోని పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆజట్టు 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.  ధోని ధనాధన్ ఇన్నింగ్స్ తో చెన్నై టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకుని ఫ్లే ఆఫ్ రేసులో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది.

ఇరు జట్ల ప్లేయింగ్ – XI (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోని (వికెట్‌ కీపర్‌), డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి, మహేష్ తీక్షణ. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్.

Key Events

ముంబైదే పైచేయి..

ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 34 సార్లు ముంబై, చెన్నై తలపడ్డాయి. చెన్నై 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ముంబై 20 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

ఓడితే నిష్క్రమణ తప్పదు..

ముంబైకి ఇది చావే రేవో మ్యాచ్‌ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ఈరోజు ఓడితే టోర్నీ నుంచి తప్పుకోవడం తప్ప మార్గం లేదు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 21 Apr 2022 11:30 PM (IST)

    ధోని మెరుపులు.. థ్రిల్లింగ్ పోరులో చెన్నై సూపర్‌ విక్టరీ..

    ధోని (13 బంతుల్లో 28) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెన్నై టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి అందుకుంది.

  • 21 Apr 2022 11:23 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన చెన్నై..

    చెన్నై జట్టు ఏడో వికెట్‌ కోల్పోయింది. డ్వేన్‌ ప్రిటోరియస్‌ (22) ను ఉనాద్కత్‌ బోల్తా కొట్టించాడు. చెన్నై విజయానికి ఇంకా 3 బంతుల్లో 10 పరుగులు అవసరం. క్రీజులో ధోని (18), బ్రేవో (1) ఉన్నారు.

  • 21 Apr 2022 10:59 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన చెన్నై.. జడేజా ఔట్‌..

    చెన్నై వరుసగా వికెట్లు కోల్పోతుంది. మెరిడెత్ బౌలింగ్‌లో కెప్టెన్‌ రవీంద్రజడేజా (3) పెవిలియన్‌ చేరాడు. దీంతో 106 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. 15.4 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే స్కోరు 106/6.

  • 21 Apr 2022 10:30 PM (IST)

    చెన్నై మూడో వికెట్‌ డౌన్‌..

    చెన్నై జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. రాబిన్‌ ఊతప్ప (30) ఉనాద్కత్‌ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో రాయుడు (22), శివమ్‌ దూబె (10) ఉన్నారు. సీఎస్కే విజయానికి ఇంకా 55 బంతుల్లో 79 పరుగులు అవసరం.

  • 21 Apr 2022 10:04 PM (IST)

    ముగిసిన పవర్‌ ప్లే.. చెన్నై స్కోరెంతంటే..

    పవర్‌ ప్లే ముగిసింది. 6 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్లు 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. క్రీజులో అంబటి రాయుడు (13), రాబిన్‌ ఊతప్ప (19) ఉన్నారు. ఆ జట్టు విజయానికి ఇంకా 84 బంతుల్లో 110 పరుగులు అవసరం.

  • 21 Apr 2022 09:46 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన చెన్నై..

    చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండో వికెట్ కోల్పోయింది. డేనియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో జయదేవ్‌ ఉనద్కత్‌కు క్యాచ్‌ ఇచ్చిన మిచెల్ పెవిలియన్‌ బాటపట్టాడు.

  • 21 Apr 2022 09:33 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై..

    156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మొదటి బంతికే రుతురాజ్‌ గైక్వాడ్‌ రూపంలో మొదటి వికెట్‌ కోల్పోయింది. తిలక్‌ వర్మ బౌలింగ్‌లో డేనియల్‌ సామ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు.

  • 21 Apr 2022 09:22 PM (IST)

    చెన్నై లక్ష్యం ఎంతంటే..

    వరుస ఓటమిలతో ఢీలా పడ్డ ముంబై ఇండియన్స్‌, చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఢీలా పడింది. రోహిత్‌ శర్మ మొదలు ఇషాన్‌ కిషన్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఇలా వరుసగా బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్‌ బాటపట్టడంతో ముంబై తక్కువ స్కోరుకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 155 పరుగులకే పరిమితమైంది. చెన్నై గెలవాలంటే 156 పరుగులు చేయాల్సి ఉంది.

  • 21 Apr 2022 08:45 PM (IST)

    100 మార్క్‌ చేరుకున్న ముంబై..

    టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై వరుస వికెట్లు కోల్పోతో నష్టాల్లోకి వెళ్లిన ముంబై జట్టు నెమ్మదిగా స్కోర్‌ పెంచే పనిలో పడింది. ఈ క్రమంలోనే 100 మార్కును చేరుకుంది. ఇంకా 5 ఓవర్లలో ఎంత స్కోర్‌ చేస్తారన్నదానిపై జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

  • 21 Apr 2022 08:37 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన ముంబై..

    ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్‌ బాటపడుతున్నారు. కేవలం 85 పరుగుల వద్దే ముంబై 5 వికెట్లు కోల్పోయింది. 13.3 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన ముంబై 85 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 21 Apr 2022 08:11 PM (IST)

    ముంబైకి మరో ఎదురుదెబ్బ..

    కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటున్నాడని అనుకుంటున్న సమయంలోనే సూర్యకుమార్‌ యాదవ్‌ అవుట్‌ అయ్యాడు. 21 బంతుల్లో 32 పరుగులు చేసిన సూర్యకుమార్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ముఖేష్‌ చౌదరికి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 21 Apr 2022 07:54 PM (IST)

    కష్టాల్లోకి ముంబై ఇండియన్స్‌..

    ముఖేష్‌ చౌదరి చెలరేగి పోతున్నాడు. ఇప్పటికే రెండు వికెట్లను పడగొట్టిన ముఖేష్‌ తాజాగా మరో వికెట్‌ను తీసుకున్నాడు. ముఖేష్‌ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ అవుట్‌ అయ్యాడు.

  • 21 Apr 2022 07:39 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై..

    ముంబై ఇండియన్స్‌కు మరో దెబ్బ తగిలింది. రోహిత్‌ శర్మ ఇలా అవుట్‌ అయ్యాడో లేదో ఇషాన్‌ కిషన్‌ రూపంలో మరో వికెట్‌ కోల్పోయింది. ముఖేష్‌ చౌదరీ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఇలా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది ముంబై.

  • 21 Apr 2022 07:35 PM (IST)

    ముంబైకి ఆదిలోనే తొలి దెబ్బ..

    ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌ మొదలైన కొద్ది సేపటికే రోహిత్‌ శర్మ రూపంలో కీలక వికెట్‌ను కోల్పోయింది. ముఖేష్‌ చౌదరీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చిన రోహిత్‌ పరుగుల ఖాతా తెలియకముందే పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 21 Apr 2022 07:31 PM (IST)

    ఇరు జట్ల ప్లేయింగ్..

    ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్‌ సామ్స్‌, హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా.

    చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోని (వికెట్‌ కీపర్‌), డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి, మహేష్ తీక్షణ, మిచెల్ స్టార్క్,

  • 21 Apr 2022 07:04 PM (IST)

    టాస్‌ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌..

    టాస్‌ గెలిచిన చెన్నై మొదట బౌలింగ్ చేయడానికి ఆసక్తి చూపింది. గత మ్యాచ్‌లో జట్లు ఫాలో అవుతున్న విధానాన్నే చెన్నై ఫాలో అయ్యింది. పాటేల్‌ స్టేడియం ఛేజింగ్‌కు సపోర్ట్‌ చేయడం, డ్యూ కారణమేదైనా చాలా జట్లు ఛేజింగ్‌కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మరి చెన్నై తీసుకున్న ఈ నిర్ణయం ఏమేర ఉపయోగపడుతుందో చూడాలి.

  • 21 Apr 2022 06:59 PM (IST)

    రోహిత్‌పైనే ఆశలు..

    ముంబైను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌ కేవలం114 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నైకు భారీ లక్ష్యం విధించాలన్నా, టార్గెట్‌ ను ఛేదించాలన్నా రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది.

Published On - Apr 21,2022 6:39 PM

Follow us
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?