AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘500-600 పరుగులు చేయడం ముఖ్యం కాదు’.. కోహ్లీ ఫ్యాన్స్‌తోపాటు విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్..

"ఏమీ మారలేదు, అంతా ఒకేలా ఉంది. నా పని బ్యాటింగ్ చేయడమే. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా, నా మొదటి పాత్ర బ్యాట్స్‌మన్‌గా, తరువాత కెప్టెన్‌గా ఉండేది. బ్యాట్స్‌మన్‌గా, నేను మ్యాచ్‌లను గెలవాలి. ఇప్పుడు నేను కెప్టెన్‌ని కానందున, నా పని జట్టుకు పరుగులు సాధించడం, మ్యాచ్‌లను గెలిపించడమే. అవసరమైన చోట నేను సహాయం చేస్తాను" అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

'500-600 పరుగులు చేయడం ముఖ్యం కాదు'.. కోహ్లీ ఫ్యాన్స్‌తోపాటు విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్..
Rohit Sharma
Venkata Chari
|

Updated on: May 02, 2025 | 11:27 AM

Share

Rohit Sharma Hits Back at Criticism: ఐపీఎల్ 2025లో గురువారం ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ సెంచరీతో అలరించాడు. అయితే, అంతకుముందు ఫామ్‌లేమితో బాధపడ్డాడు. ఫామ్‌లో లేనప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ సీజన్‌లో 500-600 పరుగులు చేయనందుకు హిట్‌మ్యాన్‌పై కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ముంబై మాజీ కెప్టెన్ విమర్శకుల నోళ్లు మూయించేందుకు ఓ కీలక ప్రకటన చేశాడు.

ఈ అనుభవజ్ఞుడైన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ తన సొంత రికార్డుల కంటే ట్రోఫీలు తనకు చాలా ముఖ్యమైనవంటూ చెప్పుకొచ్చాడు. ఎన్ని పరుగులు కావాలంటే అన్ని పరుగులు చేయవచ్చని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, కానీ వాటి విలువ జట్టు టోర్నమెంట్ గెలిచినప్పుడు మాత్రమే ఉంటుందని ఇచ్చిపడేశాడు. భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ మాట్లాడుతూ, నేను 600-700 పరుగులు చేసినప్పుడు నాకు ఒక టోర్నమెంట్ ఉంటుంది. కానీ మా జట్టు టైటిల్ గెలవలేనప్పుడు అవన్నీ వ‌ృథానే అంటూ తేల్చిపారేశాడు.

నాకు జట్టు ముఖ్యం – రోహిత్ శర్మ..

ఒక యూట్యూబ్ ఛానెల్‌లో రోహిత్ మాట్లాడుతూ, ‘2019 ప్రపంచ కప్‌లో, నేను 5 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సహాయంతో 648 పరుగులు చేశాను. కానీ, సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత మేం టోర్నమెంట్ నుండి నిష్క్రమించాం. ఒకే సెషన్‌లో ఇన్ని పరుగులు సాధించడం నా లక్ష్యం కాదు. నేను గెలవాలని కోరుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూ నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటుంటాను’ అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్ చరిత్రలో, ఏ బ్యాట్స్‌మన్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడల్లా, ఆరెంజ్ క్యాప్ గెలవలేదంటూ విమర్శకుల నోరు మూయించేలా రోహిత్ ఆన్సర్ ఇచ్చాడు. వ్యక్తిగత ప్రదర్శన ట్రోఫీగా మారదంటూ ఎత్తి చూపాడు.

‘నా 30 పరుగులు జట్టు విజయానికి సహాయపడుతున్నాయని నేను చెప్పడం లేదు’ అని మాజీ ఎంఐ కెప్టెన్ అన్నారు. జట్టుకు ప్రయోజనం చేకూర్చేలా ఏదైనా అందించడంపైనే నా దృష్టి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు నేను పరుగులు సాధించాలని అనుకునేవాడిని. కానీ, ఇప్పుడు అలా కాదు. ఎంఐ ట్రోఫీ గెలిచినప్పుడల్లా, మా జట్టు నుంచి ఏ ఆటగాడూ ఆరెంజ్ క్యాప్ గెలవలేకపోయాడని తెలిపాడు.

దీంతో పాటు, కెప్టెన్సీని విడిచిపెట్టిన తర్వాత కూడా ఏమీ మారలేదని రోహిత్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఏమీ మారలేదు, అంతా ఒకేలా ఉంది. నా పని బ్యాటింగ్ చేయడమే. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా, నా మొదటి పాత్ర బ్యాట్స్‌మన్‌గా, తరువాత కెప్టెన్‌గా ఉండేది. బ్యాట్స్‌మన్‌గా, నేను మ్యాచ్‌లను గెలవాలి. ఇప్పుడు నేను కెప్టెన్‌ని కానందున, నా పని జట్టుకు పరుగులు సాధించడం, మ్యాచ్‌లను గెలిపించడమే. అవసరమైన చోట నేను సహాయం చేస్తాను. మా గత 3-4 సీజన్‌లు బాగా లేవు. అది మనం మార్చుకోవాల్సిన విషయం. దీని గురించి మేం మాలో వివరంగా చర్చించుకున్నాం. తప్పులు పునరావృతం కాకూడదు. మేం చాలా మంచి దశలో ఉన్నాం. ఈ సీజన్ మాకు మంచిది అవుతుంది” అని తెలిపాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..