Video: రాజస్థాన్, ముంబై మ్యాచ్‌లో గల్లీ క్రికెట్ సీన్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలా?
Rajasthan Royals vs Mumbai Indians, 50th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 50వ మ్యాచ్‌లో వీధి క్రికెట్ సీన్ చోటు చేసుుకుంది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు.

Rajasthan Royals vs Mumbai Indians, 50th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 50వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టును 100 పరుగుల తేడాతో ఓడించడంలో ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, వీధి క్రికెట్ లాంటి సీన్ కనిపించింది. ఇది సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన కారణంగా ఆట చాలా సేపు ఆగిపోయింది.
ఐపీఎల్ 2025 లో వీధి క్రికెట్ సీన్..
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ సమయంలో, ధ్రువ్ జురెల్ కొట్టిన షాట్ బంతి మిస్సయింది. ఆ తర్వాత ముంబై ఆటగాళ్ళు బంతి కోసం వెతుకుతూ కనిపించారు. ఈ సంఘటన చూసిన వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ సంఘటన రాజస్థాన్ ఇన్నింగ్స్ తొమ్మిదవ ఓవర్లో కనిపించింది. ఈ ఓవర్‌ను కర్ణ్ శర్మ బౌలింగ్ చేశాడు. మూడవ బంతికి, ధ్రువ్ జురెల్ ఎక్స్‌ట్రా కవర్‌పై సిక్స్ కొట్టాడు.
POV: boys searching for the ball in gully cricket 🏐🔍
Watch the LIVE action ➡ https://t.co/QKBMQn9xdI #IPLonJioStar 👉 #RRvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar! pic.twitter.com/i4ONYwDSzo
— Star Sports (@StarSportsIndia) May 1, 2025
ధ్రువ్ జురెల్ ఈ షాట్ తర్వాత, బంతి ఫోటోగ్రాఫర్లు నిలబడి ఉన్న బౌండరీ రోప్ దగ్గర యాడ్ స్క్రీన్ దాటి వెళ్ళింది. కానీ, బంతి అకస్మాత్తుగా మిస్సయింది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ముగ్గురు బంతి కోసం వెతికారు. కానీ, ఎంత ప్రయత్నించినా బంతిని కనుగొనలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ కూడా బంతి కోసం వెతుకుతున్నట్లు కనిపించాడు. దీని కారణంగా మ్యాచ్ చాలా సేపు నిలిచిపోయింది. ఈ సంఘటన తర్వాత, అంపైర్లు కొత్త బంతిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆటగాళ్ళు వారి ఫీల్డింగ్ స్థానాలకు తిరిగి వచ్చారు. బహుశా ఇలాంటి దృశ్యం ఇంతకు ముందు ఐపీఎల్‌లో ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. ఈ సంఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబై ఇండియన్స్ ఘన విజయం..
మ్యాచ్ గురించి చెప్పాలంటే, ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్‌ల హాఫ్ సెంచరీలతో జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఆ తర్వాత, సూర్య కుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అజేయంగా తలో 48 పరుగులు చేసి జట్టు స్కోరును 217 పరుగులకు తీసుకెళ్లారు. ఛేదనలో రాజస్థాన్ జట్టు 117 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయాడు. దీని కారణంగా రాజస్థాన్ భారీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








