LSG vs RCB Match Preview: పోరుకు రెడీ అవుతున్న బెంగుళూరు, లక్నో.. రెండో క్వాలిఫయర్‌కి ఏ జట్టు వెళుతుందో..!

LSG vs RCB Match Preview: బెంగళూరు, లక్నో మధ్య బుధవారం ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌ జరగనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అలాగే గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో ఆడే అవకాశం ఉంటుంది.

LSG vs RCB Match Preview: పోరుకు రెడీ అవుతున్న బెంగుళూరు, లక్నో.. రెండో క్వాలిఫయర్‌కి ఏ జట్టు వెళుతుందో..!
Lsg Vs Rcb
Follow us

|

Updated on: May 24, 2022 | 6:27 PM

LSG vs RCB Match Preview: బెంగళూరు, లక్నో మధ్య బుధవారం ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌ జరగనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అలాగే గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో ఆడే అవకాశం ఉంటుంది. లక్నో తరుపున కేఎల్ రాహుల్ -డికాక్ ద్వయం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇటు విరాట్-మాక్స్ వెల్ కూడా బాగానే ఆడుతున్నారు. ఫాఫ్ డు ప్లెసిస్ ప్రశాంతమైన కెప్టెన్సీ ఆధారంగా జట్టు మొదటి IPL టైటిల్‌ను గెలుచుకునే దిశగా పయనిస్తోంది. మూడు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. ఈ సారైనా గెలిచే అవకాశంఉందో లేదో తెలియాలంటే ఈ మ్యాచ్‌ ఫలితం కోసం వేచి చూడాల్సిందే.

లక్నో యువ ఫాస్ట్ బౌలర్లు అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. దుష్మంత చమీర, జాసన్ హోల్డర్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు కూడా ఉన్నారు కానీ ఈ సీజన్లో వారు నిలకడగా రాణించలేకపోయారు . ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచిన లక్నో ఓపెనర్లు కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్‌ జోరుమీదున్నారు. వీరిద్దరూ కలిసి 1039 పరుగులు చేశారు. ఇందులో KKRపై చేసిన 210 పరుగుల IPL చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.

మహ్మద్ సిరాజ్ ఈ సీజన్‌లో ఆశించిన మేర రాణించలేదు కానీ హేజిల్‌వుడ్, హస్రంగ, హర్షల్ కలిసి 57 వికెట్లు తీశారు. నాకౌట్ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. T20 ప్రపంచ కప్‌కు ముందు అనేక మ్యాచ్‌లు గెలిచిన తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన దినేష్‌ కార్తీక్ జట్టు ఫినిషర్‌ పాత్ర పోషిస్తున్నాడు. 36 ఏళ్ల కార్తీక్‌ను RCB ఐదు కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. అతను 14 ఇన్నింగ్స్‌లలో 287 పరుగులు చేశాడు. అందులో అతను తొమ్మిది సార్లు నాటౌట్‌గా ఉన్నాడు. స్ట్రైక్ రేట్ 191.33.

ఇవి కూడా చదవండి

లక్నో తరఫున ప్రాబబుల్ ప్లేయింగ్ XI : క్వింటన్ డి కాక్, KL రాహుల్, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్ మరియు రవి బిష్ణోయ్.

బెంగళూరు తరపున ప్రాబబుల్ ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వనేందు హసరంగా, హర్షల్ పటేల్, సిద్ధార్థ్ కౌల్ మరియు జోష్ హేజిల్‌వుడ్

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి