GT vs RR, IPL 2022 Qualifier 1 Highlights: దుమ్మురేపిన బ్యాటర్లు.. ఫైనల్‌కు చేరుకున్న గుజరాత్‌ టైటాన్స్‌..

uppula Raju

| Edited By: Narender Vaitla

Updated on: May 24, 2022 | 11:53 PM

GT vs RR, IPL 2022 Qualifier 1 Highlights: ఐపీఎల్‌ లీగ్‌ దశ ముగిసింది. నేటి నుంచి ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి.

GT vs RR, IPL 2022 Qualifier 1 Highlights:  దుమ్మురేపిన బ్యాటర్లు.. ఫైనల్‌కు చేరుకున్న గుజరాత్‌ టైటాన్స్‌..
Gt Vs Rr

GT vs RR, IPL 2022 Qualifier 1 Highlights:  గుజరాత్‌ టైటాన్స్‌ తమ ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఇచ్చిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మిల్లర్‌ (68*), పాండ్యా (40*) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించడంతో గుజరాత్‌ విజయతీరాలకు చేరింది. దీంతో ఐపీఎల్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు చేరుకుంది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి గుజరాత్ విజయాన్ని అందుకుంది. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లకు 188 పరుగులు చేసింది. జోన్‌ బట్లర్‌ కేవలం 56 బంతుల్లో 89 పరుగులు సాధించి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సామ్‌సన్‌ 47 పరుగులు చేశాడు. అయితే ఒక్క పడిక్కల్‌ (28) తప్ప మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఇక గుజరాత్‌ ఈ విజయంతో నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. అయితే రాజస్థాన్‌కు ఫైనల్‌కు చేరుకోవడానికి మరో అవకాశం ఉంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌, బెంగళూరుల మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజయం సాధించి వారితో రాజస్థాన్‌ తలపడనుంది. బుధవారం (మే 25)న ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే.

Key Events

తొలి సీజన్‌లో గుజరాత్ అద్భుతం చేసింది

గుజరాత్ టైటాన్స్ జట్టు తొలిసారి ఐపీఎల్ ఆడుతోంది. తొలి సీజన్‌లోనే ఈ జట్టు సత్తా చాటింది. నంబర్-1లో కొనసాగుతూనే ఈ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది.

2018 తర్వాత రాజస్థాన్‌కి చోటు

రాజస్థాన్ రాయల్స్ జట్టు 2018 తర్వాత మొదటిసారి ప్లేఆఫ్‌కి చేరుకుంది. ఈ సీజన్‌లో అత్యంత సమతుల్య జట్టుగా కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 24 May 2022 11:35 PM (IST)

    ఫైనల్‌కు చేరిన గుజరాత్..

    గుజరాత్‌ టైటాన్స్‌ తమ ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఇచ్చిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మిల్లర్‌ (68*), పాండ్యా (40*) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించడంతో గుజరాత్‌ విజయతీరాలకు చేరింది. దీంతో ఐపీఎల్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇక అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేశారు. జోన్‌ బట్లర్‌ కేవలం 56 బంతుల్లో 89 పరుగులు సాధించి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సామ్‌సన్‌ 47 పరుగులు చేశాడు. అయితే ఒక్క పడిక్కల్‌ (28) తప్ప మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

  • 24 May 2022 11:26 PM (IST)

    చివరి ఓవర్‌..

    గుజరాత్‌ విజయాన్ని చేరుకోవడానికి మరో 16 పరుగుల దూరంలో ఉంది. అయితే చేతిలో కేవలం 6 బంతులు మాత్రమే ఉన్నాయి. మరి ఫామ్‌లో ఉన్న డేవిడ్‌ మిల్లర్‌, హార్ధిక్‌ పాండ్యాలు జట్టును విజయ తీరాలకు చేరుస్తారో చూడాలి.

  • 24 May 2022 11:20 PM (IST)

    దూకుడు పెంచిన మిల్లర్‌, పాండ్యా..

    వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో తగ్గిన గుజరాత్‌ స్కోర్‌ బోర్డ్‌ వేగాన్ని పెంచే పనిలో పడ్డారు మిల్లర్‌, పాండ్యా. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్‌ స్కోర్‌ 166 పరుగుల వద్ద కొనసాగుతోంది. గుజరాత్‌ విజయానికి 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో మిల్లర్‌ (44), పాండ్యా (39) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 24 May 2022 10:58 PM (IST)

    నెమ్మదించిన గుజరాత్‌ స్కోర్‌ బోర్డ్‌..

    రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి గుజరాత్‌ స్కోర్‌ బోర్డ్‌ నెమ్మదించింది. బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. గుజరాత్‌ గెలవాలంటే ఇంకా 35 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 May 2022 10:38 PM (IST)

    మరో వికెట్ డౌన్‌..

    గుజరాత్‌ మరో వికెట్‌ కోల్పోయింది. 30 బంతుల్లో 35 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న మాథ్యూ వేడ్‌.. ఒబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్‌ 3 వికెట్లు కోల్పోయి 97 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో పాండ్యా (15), మిల్లర్‌ (1) పరుగులతో ఉన్నారు.

  • 24 May 2022 10:31 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌..

    188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. 35 పరుగుల వద్ద శుభ్‌మన్‌ గిల్‌ రన్‌ అవుట్‌ రూపంలో వెనుదిరిగాడు.

  • 24 May 2022 09:44 PM (IST)

    గుజరాత్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ

    గుజరాత్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సున్నా పరుగల వద్దే మొదటి వికెట్‌ కోల్పోయింది. వృద్ధిమాన్‌ సాహా డకౌట్‌ అయ్యాడు.

  • 24 May 2022 09:42 PM (IST)

    బ్యాటింగ్‌ ప్రారంభించిన గుజరాత్

    189 పరుగుల లక్ష్యంతో గుజరాత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. క్రీజులోకి శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహ వచ్చారు.

  • 24 May 2022 09:29 PM (IST)

    రాణించిన బట్లర్‌.. గుజరాత్ లక్ష్యం189 పరుగులు

    రాజస్థాన్ 20 ఓవర్లకి 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. గుజరాత్‌కి 189 పరుగుల టార్గెట్‌ని నిర్దేశించింది. రాజస్థాన్‌ ప్లేయర్లలో ఓపెనర్‌ బట్లర్ అద్భుత ఆటతీరుని ప్రదర్శించాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. దాదాపు చివరి ఓవర్‌ వరకు క్రీజులో ఉండి స్కోరుని పెంచడానికి ప్రయత్నించాడు. కెప్టెన్‌ సంజు శామ్సన్‌ కూడా తృటిలో హాఫ్ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. 26 బంతుల్లో ఫోర్లు 3 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. దేవదత్‌ పాడిక్కల్‌ 28 పరుగులతో పర్వాలేదనిపించాడు.

  • 24 May 2022 09:11 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌

    రాజస్థాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. షిమ్రాన్ హెట్మెయర్ 3 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. దీంతో 18.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రాజస్థాన్‌ 161 పరుగులు చేసింది.

  • 24 May 2022 09:05 PM (IST)

    150 పరుగులు దాటిన రాజస్థాన్‌

    రాజస్థాన్ 17.2 ఓవర్లలలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్ 61 పరుగులు, షిమ్రాన్ హెట్మెయర్ 3 పరుగుతో ఆడుతున్నారు. గుజరాత్‌ బౌలర్లలో యశ్‌ దాయాల్‌కి ఒక వికెట్‌, రవి శ్రీనివాసన్‌కి ఒక వికెట్‌, హార్దిక్ పాండ్య ఒక వికెట్‌ దక్కింది.

  • 24 May 2022 08:59 PM (IST)

    హాఫ్ సెంచరీ సాధించిన జోస్‌ బట్లర్

    రాజస్థాన్ ఓపెనర్ జోస్‌ బట్లర్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. 42 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. దీంతో 16.4 ఓవర్లలో రాజస్థాన్‌ మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

  • 24 May 2022 08:52 PM (IST)

    15 ఓవర్లకి రాజస్థాన్124 /3

    రాజస్థాన్‌ 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజులో జోస్‌ బట్లర్‌ 37 పరుగులు, షిమ్రాన్ హెట్మెయర్ 1 పరుగుతో ఆడుతున్నారు. గుజరాత్‌ బౌలర్లలో యశ్‌ దాయాల్‌కి ఒక వికెట్‌, రవి శ్రీనివాసన్‌కి ఒక వికెట్‌, హార్దిక్ పాండ్య ఒక వికెట్‌ దక్కింది.

  • 24 May 2022 08:47 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌

    రాజస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. దేవదత్‌ పాడిక్కల్ 28 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. దీంతో 14.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రాజస్థాన్‌116 పరుగులు చేసింది.

  • 24 May 2022 08:41 PM (IST)

    100 పరుగులు దాటిన రాజస్థాన్

    రాజస్థాన్ 13 ఓవర్లలలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్ 29 పరుగులు, దేవదత్‌ పాడిక్కల్ 13 పరుగులతో ఆడుతున్నారు. గుజరాత్‌ బౌలర్లలో యశ్‌ దాయాల్‌కి ఒక వికెట్‌, రవి శ్రీనివాసన్‌కి ఒక వికెట్‌ దక్కింది.

  • 24 May 2022 08:25 PM (IST)

    10 ఓవర్లకి రాజస్థాన్ 79/2

    రాజస్థాన్‌ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో జోస్‌ బట్లర్‌ 23 పరుగులు, దేవదత్‌ పాడిక్కల్‌ 0 పరుగులతో ఆడుతున్నారు. గుజరాత్‌ బౌలర్లలో యశ్‌ దాయాల్‌కి ఒక వికెట్‌, రవి శ్రీనివాసన్‌కి ఒక వికెట్‌ దక్కింది.

  • 24 May 2022 08:22 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌

    రాజస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. సంజు శామ్సన్‌ 47 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. దీంతో 9.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి రాజస్థాన్‌ 79 పరుగులు చేసింది.

  • 24 May 2022 08:03 PM (IST)

    50 పరుగులు దాటిన రాజస్థాన్‌

    రాజస్థాన్ 5.4 ఓవర్లలలో ఒక వికెట్‌ నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్ 16 పరుగులు, సంజు శామ్సన్‌ 30 పరుగులతో ఆడుతున్నారు. గుజరాత్‌ బౌలర్లలో యశ్‌ దాయాల్‌కి ఒక వికెట్‌ దక్కింది.

  • 24 May 2022 07:58 PM (IST)

    5 ఓవర్లకి రాజస్థాన్ 42/1

    రాజస్థాన్‌ 5 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో జోస్‌ బట్లర్‌ 15 పరుగులు, సంజు శామ్సన్‌ 18 పరుగులతో ఆడుతున్నారు. గుజరాత్‌ బౌలర్లలో యశ్‌ దాయాల్‌కి ఒక వికెట్‌ దక్కింది.

  • 24 May 2022 07:40 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌

    రాజస్థాన్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 3 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. దీంతో 2 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి రాజస్థాన్‌ 11 పరుగులు చేసింది.

  • 24 May 2022 07:31 PM (IST)

    బ్యాటింగ్‌ ప్రారంభించిన రాజస్థాన్

    రాజస్థాన్ బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, జోస్‌ బట్లర్ క్రీజులోకి వచ్చారు.

  • 24 May 2022 07:21 PM (IST)

    ఇరుజట్ల సభ్యులు

  • 24 May 2022 07:06 PM (IST)

    టాస్‌ గెలిచిన గుజరాత్.. మొదటగా బౌలింగ్‌

    గుజరాత్‌ టాస్‌ గెలిచింది. మొదటగా బౌలింగ్‌ ఎంచుకుంది.

Published On - May 24,2022 7:01 PM

Follow us