క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్.. లార్డ్స్ ఘనత

ఇంగ్లండ్ లోని లార్డ్స్‌ మైదానం క్రికెట్ సామ్రాజ్యానికి రాజధాని లాంటిది. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ స్టేడియంతో మన జట్టుకు ఉన్న అనుబంధం తక్కువేం కాదు. భారత్‌ తన తొలి టెస్టును ఇక్కడే ఆడింది. 1983 ప్రపంచకప్‌ను అందుకున్నదీ ఇక్కడే. 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ను గెలుచుకుని, గంగూలీ చొక్కా విప్పి చిందులేసిందీ ఈ మైదానంలోనే. లార్డ్స్‌ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనుంది. అయిదోసారి ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు ఆతిథ్యమిచ్చిన స్టేడియంగా చరిత్రకెక్కనుంది. ఆ ఫైనల్లో మన […]

క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్.. లార్డ్స్ ఘనత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 22, 2019 | 6:52 PM

ఇంగ్లండ్ లోని లార్డ్స్‌ మైదానం క్రికెట్ సామ్రాజ్యానికి రాజధాని లాంటిది. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ స్టేడియంతో మన జట్టుకు ఉన్న అనుబంధం తక్కువేం కాదు. భారత్‌ తన తొలి టెస్టును ఇక్కడే ఆడింది. 1983 ప్రపంచకప్‌ను అందుకున్నదీ ఇక్కడే. 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ను గెలుచుకుని, గంగూలీ చొక్కా విప్పి చిందులేసిందీ ఈ మైదానంలోనే. లార్డ్స్‌ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనుంది. అయిదోసారి ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు ఆతిథ్యమిచ్చిన స్టేడియంగా చరిత్రకెక్కనుంది. ఆ ఫైనల్లో మన దేశం కూడా ఉండాలని ఆశిద్దాం.