AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs KKR, IPL 2022: ఐపీఎల్‌లో బోణి కొట్టిన కోల్‌కతా.. చెన్నైపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం..

గత ఐపీఎల్‌ ఫైనల్‌లో ఎదురైన పరాభవానికి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) ప్రతీకారం తీర్చుకుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో శనివారం జరిగిన ఆరంభమ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చైన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)ను మట్టి కరిపించింది.

CSK vs KKR, IPL 2022: ఐపీఎల్‌లో బోణి కొట్టిన కోల్‌కతా.. చెన్నైపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం..
Csk Vs Kkr
Basha Shek
|

Updated on: Mar 27, 2022 | 12:27 AM

Share

గత ఐపీఎల్‌ ఫైనల్‌లో ఎదురైన పరాభవానికి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) ప్రతీకారం తీర్చుకుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో శనివారం జరిగిన ఆరంభమ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చైన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)ను మట్టి కరిపించింది. తద్వారా మెగా టోర్నీలో బోణీ కొట్టింది. చెన్నై నిర్దేశించిన 132 పరుగుల స్వల్ప టార్గెట్‌ను 18.3 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్‌ అజింక్యా రహానే (34 బంతుల్లో 44), సామ్ బిల్లింగ్స్‌ (22 బంతుల్లో 25), నితీష్‌ రాణా(21), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (20) పరుగులతో కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో మూడు వికెట్లు పడగొట్టగా స్పిన్నర్‌ మిచెల్ శాంట్నర్‌ ఓ వికెట్‌ తీశాడు. స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. అజింక్య రహానె వరుస బౌండరీలతో ఆకట్టుకోగా, మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (16) సంయమనంతో ఆడాడు. వీరిద్దరి ధాటికి పవర్‌ ప్లే ముగిసే సరికి కోల్‌కతా 43/0 స్కోరుతో నిలిచింది. కాగా అర్ధ సెంచరీ వైపు దూసుకెళుతోన్న ఈ జోడీని ఏడో ఓవర్లో.. బ్రేవో విడదీశాడు. వెంకటేశ్ అయ్యర్ కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (21) ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. అయితే బ్రేవో వేసిన పదో ఓవర్లో అంబటి రాయుడికి క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ (20 నాటౌట్‌), ఓపెనర్‌ రహనేతో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే శాంట్నర్‌ వేసిన 12వ ఓవర్లో రహానే ఔట్‌ కాగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సామ్ బిల్లింగ్స్‌ (25).. శ్రేయస్‌తో కలిసి జట్టుని లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. అయితే విజయానికి చేరువలో ఉండగా బ్రావో వేసిన 18వ ఓవర్లో తుషార్ దేశ్‌పాండేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు బిల్లింగ్స్‌. అయితే షెల్డన్‌ జాక్సన్‌ (3నాటౌట్‌)తో కలిసి టార్గెట్‌ను పూర్తి చేశాడు శ్రేయస్ అయ్యర్. ఆరంభ ఓవర్లలో చెన్నైను దెబ్బతీసిన ఉమేశ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ధోని అర్ధ సెంచరీ..

కాగా అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఆశించిన శుభారంభం దక్కలేదు. పిచ్‌ నుంచి సహకారం అందుతుండడంతో కేకేఆర్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ముఖ్యంగా గత సీజన్‌లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన టీమిండియా బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే గత సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ గెలిచిన ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (0)ను పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(3)ను బోల్తా కొట్టించాడు. రాబిన్ ఉతప్ప (28) కొన్ని మంచి షాట్లు ఆడినా షెల్డన్ జాక్సన్ మెరుపు వేగంతో చేసిన స్టంపౌట్‌కు వెనుదిరగక తప్పలేదు. ఆపై మరో మూడు వికెట్లు వరుసగా కోల్పోవడంతో 11 ఓవర్లలో ఆ జట్టు 61/5 స్థితిలో నిలిచింది. అయితే ఇక్కడి నుంచి కెప్టెన్ జడేజా (26) మాజీ కెప్టెన్ ధోనీతో జత కలిశాడు. ప్రారంభంలో ఇబ్బంది పడిన మిస్టర్ కూల్‌ ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 38 బంతుల్లోనే ధోని 50 పరుగులు (7 ఫోర్లు, 1 సిక్స్)తో అజేయంగా నిలిచాడు. కేకేఆర్ తరఫున ఉమేష్ యాదవ్ (2/20) రాణించగా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ చెరో వికెట్ తీశారు. Also Read: Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. పలువురు మృతి

Viral Video: అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఈ యువతి పరిస్థితి చూస్తే మీరూ జాలిపడాల్సిందే!

International Flights: అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త.. రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత పునరుద్దరణ