AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: విహారయాత్రలో నిశ్చితార్థం.. మూడుసార్లు పెండ్లి.. నాలుగేళ్లకే ముక్కలైన పాండ్యా కుటుంబం

Hardik Pandya - Natasa Stankovic: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాసా స్టాంకోవిచ్ నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించారు. నటాషాది సెర్బియా తన దేశానికి తిరిగి చేరుకుంది. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్టార్ క్రికెటర్ తెలిపాడు. గత 6 నెలలుగా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరూ స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధృవీకరించారు.

Hardik Pandya: విహారయాత్రలో నిశ్చితార్థం.. మూడుసార్లు పెండ్లి.. నాలుగేళ్లకే ముక్కలైన పాండ్యా కుటుంబం
Hardik Pandya Natasa Stanko
Venkata Chari
|

Updated on: Jul 19, 2024 | 3:36 PM

Share

Hardik Pandya – Natasa Stankovic: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాసా స్టాంకోవిచ్ నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించారు. నటాషాది సెర్బియా తన దేశానికి తిరిగి చేరుకుంది. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్టార్ క్రికెటర్ తెలిపాడు. గత 6 నెలలుగా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరూ స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధృవీకరించారు.

హార్దిక్, నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే విధమైన పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో, “4 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత, నటాషా, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేం కలిసి మా వంతు ప్రయత్నం చేశాం. మా వంతు కృషి చేశాం. ఫైనల్‌గా మా ఇద్దరికీ ఉత్తమ నిర్ణయం ఇదేనని నిర్ణయించుకున్నాం.” అంటూ చెప్పుకొచ్చాడు.

కొడుకు అగస్త్య గురించి, “అగస్త్య రాకతో మా జీవితాలు మరింత సంతోషంగా మారాయి. అతను మా ఇద్దరి జీవితాలకు కీలకంగా ఉంటాడు. అతని ఆనందం కోసం మేం చేయగలిగినదంతా చేస్తాం.” అని ప్రకటించాడు.

మీడియా నివేదికల ప్రకారం, హార్దిక్, నటాషా 2018లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. హార్దిక్, నటాషా జనవరి 1, 2020న విహారయాత్రలో నిశ్చితార్థం చేసుకున్నారు. హార్దిక్ పోస్ట్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అకస్మాత్తుగా తన నిశ్చితార్థాన్ని ప్రకటించాడు. ఈ విషయం అప్పటి వరకు ఎవరికీ తెలియదు.

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో హార్దిక్, నటాషా పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలల తరువాత, నటాషా కొడుకు అగస్త్యకు జన్మనిచ్చింది. 2023లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని హార్దిక్, నటాషా నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ భారతీయ, సెర్బియా పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.

ఈ ఏడాది మే నెలలో వీరి విడాకులకు సంబంధించిన ఊహాగానాలు మొదలయ్యాయి. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ‘పాండ్యా’ని తొలగించడంతో ఇది ప్రారంభమైంది. “నటాషా, హార్దిక్ విడిపోయారు” అంటూ రెడ్డిట్‌లో వైరల్ అవ్వగానే.. నెటిజన్లు అగ్నికి మరింత ఆజ్యం పోశారు. IPL 2024 మ్యాచ్‌లకు నటాషా గైర్హాజరు కావడంపై ఒక వినియోగదారు ప్రశ్నలు లేవనెత్తాడు. ఇది ఇప్పుడు నిజమని నిరూపితమైంది. ఇద్దరూ విడిపోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..