AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: వేలానికి ముందే రూ 20 కోట్లకు కొనేశారుగా.. కేఎల్ రాహుల్‌కి ఊహించని ప్రైజ్?

Royal Challengers Bengaluru, IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలంలో కేఎల్ రాహుల్‌పై అన్ని జట్లు కన్నేవేశాయి. ఈ మల్టీ ట్యాలెండెట్ ప్లేయర్‌ను తీసుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయి. అందుకే ఈ మెగా వేలంలో కేఎల్ రాహుల్ ధర విపరీతంగా పెరిగి ఛాన్స్ ఉంది.

IPL 2025: వేలానికి ముందే రూ 20 కోట్లకు కొనేశారుగా.. కేఎల్ రాహుల్‌కి ఊహించని ప్రైజ్?
Kl Rahul
Venkata Chari
|

Updated on: Nov 14, 2024 | 4:52 PM

Share

IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులు కేఎల్ రాహుల్‌ను 2025 ఐపీఎల్ సీజన్‌లో తిరిగి తమ జట్టులోకి తీసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 24-25 తేదీల్లో జెడ్డాలో జరిగే వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కర్ణాటక బ్యాటర్ కం వికెట్ కీపర్ మోగా వేలంలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో అభిమానులు మాక్ వేలం నిర్వహించారు. రాహుల్‌ను తిరిగి బెంగళూరు జట్టులోకి తీసుకురావడానికి రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసేందుకైనా అభిమానులు వెనుకాడలేదు.

కేఎల్ రాహుల్ కోసం మూడు జట్లు తీవ్రంగా పోరాడాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మూడు ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన బిడ్డింగ్ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ బిడ్డింగ్‌ను రూ. 15 కోట్లకు పెంచింది. RCB దానిని అదనంగా కోటి పెంచింది. కేఎల్ రాహుల్ ప్రతిభ, నాయకత్వ లక్షణాలు అతన్ని విలువైన ఆటగాడిగా మార్చాయి. టాప్-ఆర్డర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఏ జట్టునైనా బలోపేతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.

స్టార్ స్పోర్ట్స్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. భారత T20I జట్టులోకి తిరిగి రావడానికి 2025 IPLని ఒక అవకాశంగా ఉపయోగించుకోనున్నట్లు చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ తన చివరి T20I ప్రదర్శన నవంబర్ 2022లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగింది. ఆ తరువాత గాయాలు, టీ20 ప్రపంచ కప్‌తో సహా టీమిండియా టీ20ఐ జట్టు నుంచి అతను దూరమయ్యాడు. రాహుల్ ODIలు, టెస్ట్‌లలో రెగ్యులర్‌గా కొనసాగుతుండగా, 2025 IPL సీజన్ అతను T20 ఫార్మాట్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇటు వికెట్ కీపర్, అటు టాప్-ఆర్డర్ బ్యాటర్‌తోపాటు కెప్టెన్‌గా రాహుల్ పాత్ర ఆయా జట్లకు బ్యాలెన్స్ చేయడానికి సౌలభ్యాన్ని అందిస్తుంది. అలాగే, IPL కెప్టెన్‌గా కేఎల్ రికార్డు అద్భుతంగా ఉంది. 48.43% గెలుపుతో తన సత్తా చాటాడు. అయితే, అసలు వేలంలో ఏ జట్టు కేఎల్‌ఆర్‌ని దక్కించుకుంటుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..