IPL 2025: ఆ ముగ్గురిపై ఆర్‌టీఏం కార్ట్ ఉపయోగించనున్న ఢిల్లీ.. లిస్ట్‌లో డేంజరస్ ఓపెనర్?

IPL Mega Auction 2025: ఐపీఎల్ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం అందరి చూపు నవంబర్ 24, 25పైనే నిలిచింది. ఈ ఏడాది వేలంలో ఎన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాల్సి ఉంది. దుబాయ్‌లో జరగనున్న వేలంలో స్టార్ ప్లేయర్లు రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యారు.

IPL 2025: ఆ ముగ్గురిపై ఆర్‌టీఏం కార్ట్ ఉపయోగించనున్న ఢిల్లీ.. లిస్ట్‌లో డేంజరస్ ఓపెనర్?
Delhi Capitals
Follow us
Venkata Chari

|

Updated on: Nov 14, 2024 | 3:10 PM

IPL Mega Auction 2025: ఐపీఎల్ 2025 వేలానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని జట్లు తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి. అయితే, చాలామంది కీలక ప్లేయర్లు వేలంలోకి రానున్నారు. వీళ్లపై అన్ని ఫ్రాంచైజీలు కన్నేశాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో అక్షర్ పటేల్‌తో సహా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడుదల చేసింది. రూ. 73 కోట్ల పర్స్‌తో వేలంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును బలంగా నిర్మించాలని ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో ఓ ఇద్దరిపై ఆర్‌టీఏం కార్డ్‌ను ఉపయోగించాలని స్కెచ్ వేశారంట. ఆ లిస్ట్‌లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్..

అక్షర్ పటేల్ – రూ. 16.5 కోట్లు

కుల్దీప్ యాదవ్ – రూ. 13.25 కోట్లు

ట్రిస్టన్ స్టబ్స్ – రూ. 10 కోట్లు

అభిషేక్ పోరెల్ – రూ. 4 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన లిస్ట్‌లో అక్షర్ పటేల్ అగ్రస్థానంలో నిలిచాడు. అందుకే ఈ స్పిన్నర్‌కు రూ. 16.5 కోట్లు అందించింది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగనున్న మెగా వేలం కోసం ఢిల్లీకి ఇప్పుడు రెండు రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించుకోవాలని కోరుకుంటుంది.

ఏ ఆటగాడిపై ఢిల్లీ క్యాపిటల్స్ RTM ఉపయోగించవచ్చు?

గత సంవత్సరం ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ తన IPL ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాబోయే సీజన్‌లోనూ ఓపెనర్‌గా తిరిగి పొందేందుకు క్యాపిటల్స్ ఆసక్తి చూపుతుంది. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌పై ఆర్‌టీఏం కార్డ్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. భారత ఫాస్ట్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్‌లపైనా RTM కార్డును ఉపయోగించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపుతోంది.

గమనిక: KKR, RR మొత్తం ఆరుగురు ఆటగాళ్లను కలిగి ఉన్నందున ఆ ఫ్రాంచైజీలకు RTMలు లేవు. పంజాబ్ కింగ్స్ మాత్రం కేవలం ఇద్దిరిని మాత్రమే రిటైన్ చేసుకుంది. ఇందులో భాగంగా అత్యధికంగా ఆర్‌టీఏంలను ఉపయోగించుకోవాలని ప్రతీజింటా టీం కోరుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.