KKR IPL 2024 Auction: 12మంది ఆటగాళ్ల కోసం వేలంలోకి.. కోల్‌కతా నైట్ రైడర్స్ స్కెచ్ అదుర్స్ అంటోన్న నెటిజన్స్..
Kolkata Knight Riders IPL 2024 Auction: ఈసారి కోల్‌కతా ఫ్రాంచైజీ తన జట్టు నుంచి మొత్తం 12 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. వీరిలో అత్యధిక సంఖ్యలో ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేకేఆర్ ఈ వేలంలో ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లను టార్గెట్ చేయాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Kolkata Knight Riders IPL 2024 Auction Plan: ఐపీఎల్ 2024 వేలం కోసం కోల్‌కతా ఫ్రాంచైజీ సిద్ధమవుతోంది. వేలంలో ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లను కొనుగోలు చేయాలనే ఒత్తిడిలో కేకేఆర్ ఫ్రాంచైజీ ఉంది. ఇతర జట్లు 6 నుంచి 8 మంది ఆటగాళ్లు కావాల్సి ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ టీం మాత్రం ఏకంగా 12 మంది ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఖాళీ స్లాట్‌లను భర్తీ చేసేందుకు కేకేఆర్ వద్ద పర్స్‌లో రూ. 32.7 కోట్లు మాత్రమే ఉన్నాయి.
ఈసారి కోల్‌కతా ఫ్రాంచైజీ తన జట్టు నుంచి మొత్తం 12 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. వీరిలో అత్యధిక సంఖ్యలో ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేకేఆర్ ఈ వేలంలో ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లను టార్గెట్ చేయాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
KKR తన జట్టు నుంచి లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్ వంటి స్టార్ ఫాస్ట్ బౌలర్లను తొలగించింది. ప్రస్తుతం జట్టులో ఆండ్రీ రస్సెల్, వైభవ్ అరోరా తప్ప మంచి ఫాస్ట్ బౌలర్ లేడు. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 19న జరిగే వేలంలో కనీసం నలుగురైదుగురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లను జట్టులో చేర్చుకోవాల్సిన ఒత్తిడి కేకేఆర్ ఫ్రాంచైజీపై నిలిచింది.
ఇక్కడ KKR మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, గుస్ అట్కిన్సన్, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ వంటి విదేశీ ఫాస్ట్ బౌలర్లపై దృష్టి పెట్టవచ్చు. జట్టులో ఇద్దరు, ముగ్గురు భారత ఫాస్ట్ బౌలర్లను కూడా చేర్చుకోవాల్సి ఉంటుంది. హర్షల్ పటేల్ లాంటి బౌలర్లను ఈ లిస్టులో ఉండొచ్చు.
బ్యాటింగ్ విభాగంలో కేకేఆర్ కాస్త సమతూకంగా కనిపిస్తున్నాడు. అయితే, ఇక్కడ కూడా ఒకరిద్దరు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్స్ కొరత ఉంది. ఇటువంటి పరిస్థితిలో, కోల్‌కతా ఫ్రాంచైజీ వేలంలో కొంతమంది మంచి బ్యాట్స్‌మెన్స్‌పై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇక్కడ, KKR విదేశీ బ్యాట్స్‌మెన్‌లలో ఒకటి లేదా ఇద్దరు కీలక పేర్లను లక్ష్యంగా చేసుకుని, వేలంలోకి అడుగుపెట్టే వీలుంది.
రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా: నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జాసన్ రాయ్.
రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా: షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, ఆర్య దేశాయ్, నారాయణ్ జగదీసన్, మన్‌దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, జాన్సన్ చార్లెస్ , డేవిడ్ విస్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..