Video: నువ్వెక్కడ దొరికావురా సామీ.. ఒకే ఓవర్ లో 20 రన్స్! బుమ్రా బౌలింగ్ లోనే వీరబాదుడు!
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో బుమ్రా ఓ ఓవర్‌లో 20 పరుగులు ఇవ్వడం మ్యాచ్‌కు కీలక మలుపుగా మారింది. ఇంగ్లిస్ ధాటికి బుమ్రా తడబడగా, శ్రేయాస్ అయ్యర్ అజేయ ఇన్నింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముంబై బౌలింగ్‌లోనూ బ్యాటింగ్‌లోనూ కీలక ఆటగాళ్లు పోరాడినప్పటికీ విజయం మాత్రం చేజారింది. 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన పంజాబ్ అభిమానుల్లో ఊపు నింపింది.

ఐపీఎల్ 2025లో జరిగిన క్వాలిఫయర్ 2లో జస్ప్రీత్ బుమ్రా జీవితంలో మరచిపోలేని ఓవర్‌ను ఎదుర్కొన్నాడు. సాధారణంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బుమ్రా బౌలింగ్‌ను గౌరవిస్తూ జాగ్రత్తగా ఆడుతారు. అయితే, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించాడు. ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు క్రీజులోకి వచ్చిన ఇంగ్లిస్, బుమ్రా బౌలింగ్‌ను స్కూల్‌బాయ్ లెవెల్‌గా భావించి అచ్చం అదే తరహాలో అతన్ని ఎదుర్కొన్నాడు. ఐదో ఓవర్‌లో బుమ్రా బౌలింగ్ చేయగా, తొలి బంతికే ఇంగ్లిస్ ఫోర్ కొట్టి దాడికి శ్రీకారం చుట్టాడు. ఆపై ఓ డాట్ బాల్ వచ్చినా మూడవ బంతికి భారీ సిక్స్, ఐదో బంతికి మళ్లీ ఫోర్, చివరి బంతికి మరో సిక్స్ తో మొత్తం 20 పరుగులు బుమ్రా ఓవర్లో కొట్టాడు. ఇది బుమ్రాకు ఈ సీజన్‌లో ఎదురైన అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది.
ఇంగ్లిస్ దాడి ధాటికి బుమ్రా మౌనమవ్వక తప్పలేదు. అతని ఆత్మవిశ్వాసానికి ఈ ఓవర్ తీవ్రంగా దెబ్బ తీయగా, ముంబైకి అదే కీలక మలుపుగా మారింది. ముంబై బ్యాటింగ్‌లో తిలక్ వర్మ (44), సూర్యకుమార్ యాదవ్ (44), నమన్ ధీర్ (18 బంతుల్లో 37) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి, 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగుల బలమైన స్కోరు నమోదు చేశారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయి రెండు వికెట్లు తీసి ముంబై దూకుడును కొంతవరకు నియంత్రించాడు.
వెనువెంటనే బాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్‌ను తొందరగా కోల్పోయినా, ఇంగ్లిస్ (21 బంతుల్లో 38), నేహాల్ వధేరా (29 బంతుల్లో 48) మెరిసి శ్రేయాస్ అయ్యర్‌కి అద్భుత మద్దతు ఇచ్చారు. కెప్టెన్ అయ్యర్ మాత్రం అసాధారణ ప్రదర్శనతో కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 87 పరుగులు చేసి ఒంటరి పోరాటంలో జట్టును విజయం వైపు నడిపించాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసినప్పటికీ, పంజాబ్ బ్యాటర్ల దూకుడు ముందు నిలవలేకపోయారు.
ఈ విజయం ద్వారా పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. ఈ విజయాన్ని శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా పేర్కొనవచ్చు. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనుంది. ఈ సీజన్‌లో కొత్త ఐపీఎల్ ఛాంపియన్ ఖాయం కావడంతో, క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. బుమ్రా ఓవర్లో ఇంగ్లిస్ కొట్టిన 20 పరుగుల కారణంగా మ్యాచ్ దిశ మలుపు తిరగడం ముంబై అభిమానులకు నిరాశ కలిగించినా, పంజాబ్ అభిమానులకు ఇది ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చింది.
Pressure? What pressure? 😏
🎥 Josh Inglis fights fire with fire and takes on Jasprit Bumrah with handsome hits! 💪#PBKS 64/2 after 6 overs.
Updates ▶ https://t.co/vIzPVlDqoC#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @PunjabKingsIPL pic.twitter.com/c4Wp2hXcQx
— IndianPremierLeague (@IPL) June 1, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



