AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Update: 2028 నుంచి పూర్తిగా మారిపోనున్న ఐపీఎల్ షెడ్యూల్.. బీసీసీఐ ప్లాన్ మామూలుగా లేదు

IPL Update : ఇకపై ఐపీఎల్ అంటే కేవలం రెండు నెలల సందడి మాత్రమే కాదు.. అంతకు మించి ఉండబోతోంది. ముఖ్యంగా మ్యాచ్‌ల సంఖ్య విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా లీగ్ భవిష్యత్తుపై ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు.

IPL Update:  2028 నుంచి పూర్తిగా మారిపోనున్న ఐపీఎల్ షెడ్యూల్.. బీసీసీఐ ప్లాన్ మామూలుగా లేదు
Ipl
Rakesh
|

Updated on: May 08, 2026 | 4:19 PM

Share

IPL Update: ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్… ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL) భవిష్యత్తులో మరిన్ని మెరుపులు మెరిపించబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ అభిమానులను అలరిస్తుండగానే, బీసీసీఐ (BCCI) రాబోయే సీజన్ల కోసం ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇకపై ఐపీఎల్ అంటే కేవలం రెండు నెలల సందడి మాత్రమే కాదు.. అంతకు మించి ఉండబోతోంది. ముఖ్యంగా మ్యాచ్‌ల సంఖ్య విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా లీగ్ భవిష్యత్తుపై ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాబోయే మీడియా రైట్స్ సైకిల్ (2028 నుంచి) కోసం టోర్నమెంట్ ఫార్మాట్‌లో పెద్ద మార్పులు చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ప్రస్తుతం ఒక సీజన్‌లో ప్లేఆఫ్స్‌తో కలిపి 74 మ్యాచ్‌లు జరుగుతుండగా, 2028 నుంచి ఈ సంఖ్యను ఏకంగా 94కి పెంచబోతున్నారు. దీనివల్ల ఆటగాళ్లకు సవాలు పెరగడమే కాకుండా, ప్రేక్షకులకు మరిన్ని ఉత్సాహభరితమైన పోరాటాలు చూసే అవకాశం లభిస్తుంది.

లీగ్ స్టేజ్‌లో పెరగనున్న పోరు

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక టీమ్ లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌లు ఆడుతోంది. అయితే 2028 నుంచి ఈ సంఖ్య 18కి చేరనుంది. అంటే టోర్నమెంట్ మరికొన్ని రోజులు అదనంగా జరుగుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కోసం జరిగే యుద్ధం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారనుంది. మ్యాచ్‌ల సంఖ్య పెరగడం వల్ల ఆటగాళ్ల ఫిట్‌నెస్, జట్ల వ్యూహాలు కూడా మారే అవకాశం ఉంది.

జట్ల సంఖ్యలో మార్పు లేదు

మ్యాచ్‌లు పెరుగుతున్నాయి కదా అని కొత్త టీమ్స్ వస్తాయని భావిస్తే పొరపాటే. ఐపీఎల్‌లో ప్రస్తుతానికి ఉన్న 10 జట్లే కొనసాగుతాయని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. కొత్త జట్లను ఇప్పుడే చేర్చడం సరైన నిర్ణయం కాదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందుకే ఉన్న 10 జట్ల మధ్యే మ్యాచ్‌ల సంఖ్యను పెంచి లీగ్‌ను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నాణ్యమైన క్రికెట్ ప్రేక్షకులకు అందుతుందని బోర్డు ఆశిస్తోంది.

హోమ్ అండ్ అవే సిస్టమ్ పక్కా

మ్యాచ్‌ల సంఖ్యను 94కి పెంచడం వెనుక అసలు కారణం హోమ్ అండ్ అవే ఫార్మాట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడమే. అంటే ప్రతి జట్టు మరో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. ఒక మ్యాచ్ తన సొంత మైదానంలో (Home) ఆడితే, రెండో మ్యాచ్ ప్రత్యర్థి జట్టు మైదానంలో (Away) ఆడుతుంది. దీనివల్ల అన్ని జట్లకు సమానమైన అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం గ్రూప్ సిస్టమ్ వల్ల కొన్ని జట్లతో ఒకే మ్యాచ్ ఆడే పరిస్థితి ఉంది, కానీ 2028 నుంచి ఈ లోపం తొలగిపోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us