AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నరాలు తెగిపోయే హైవోల్టేజ్ మ్యాచ్! RR పరాజయం తరువాత కుంగిపోయిన ద్రావిడ్ వీడియో వైరల్!

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక పరుగు తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. కెప్టెన్ రియాన్ పరాగ్ 95 పరుగులతో మెరిసినా, మిగిలిన ఆటగాళ్లు పూర్తిగా మద్దతివ్వకపోవడం ఓటమికి దారితీసింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ ఓటమితో RR ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు తుడిచిపెట్టుకున్నాయి.

Video: నరాలు తెగిపోయే హైవోల్టేజ్ మ్యాచ్! RR పరాజయం తరువాత కుంగిపోయిన ద్రావిడ్ వీడియో వైరల్!
Dravid
Narsimha
|

Updated on: May 05, 2025 | 11:57 AM

Share

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు వరుసగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం ఒక పరుగు తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 207 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు మైదానంలో దిగిన రాయల్స్, కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుతమైన ప్రదర్శనతో 45 బంతుల్లో 95 పరుగులు చేసి, మ్యాచ్‌ను చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా మార్చాడు. అయితే చివరకు వారి స్కోరు 20 ఓవర్లలో 205/8కి పరిమితమై ఒక పరుగు తేడాతో పరాజయం చవిచూసింది.

ఈ ఓటమి కారణంగా రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. మ్యాచ్ సమయంలో డగౌట్‌లో ఉండే ద్రవిడ్ ఎప్పటిలాగానే శాంతంగా కనిపించినా, చివరికి ఓటమి తాలూకు బాధను తట్టుకోలేకపోయాడు.

మ్యాచ్ వివరాల్లోకి వెళితే, మొదట బ్యాటింగ్ చేసిన KKR 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఈ స్కోరులో ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో అజేయంగా 57 పరుగులు చేయడం, రింకు సింగ్ చివర్లో ఆరు బంతుల్లో 19 పరుగులు చేయడం కీలక పాత్ర పోషించాయి. అలాగే అంగ్క్రిష్ రఘువంశీ 44, రహ్మానుల్లా గుర్బాజ్ 35 పరుగులు చేయడంతో KKR భారీ స్కోరును నమోదు చేయగలిగింది.

ఛాజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ మొదట్లో రెండు వికెట్లు త్వరగా కోల్పోయింది. ఆపై మిడిల్ ఓవర్లలో వరుసగా మూడు వికెట్లు పడిపోవడంతో దళం తీవ్ర ఒత్తిడిలో పడింది. కానీ కెప్టెన్ పరాగ్ ధైర్యంగా ఎదుర్కొంటూ అద్భుతంగా బాదాడు. ఒక దశలో అతను వరుసగా ఆరు సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. చివర్లో హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, శుభమ్ దూబే వంటి బ్యాటర్లు కలిసి మ్యాచ్‌ను గెలిచే స్థితికి తీసుకొచ్చారు. అయితే, KKR బౌలర్లలో స్పిన్నర్లు మోయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాయల్స్‌కు మ్యాచ్‌ను చేజార్చారు.

ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం వారు మూడే విజయాలతో, తొమ్మిది ఓటములతో ఉన్నారు. తమ తదుపరి మ్యాచ్‌ను చెన్నైలో మే 12న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్నారు. ఈ మ్యాచ్ వారి గౌరవ రక్షణగా నిలవనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.