AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్లటి నీటిలో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? అబ్బబ్బ ఏమన్నా లాభాలా..

చలి కాలం.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ సమయంలో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇంకా.. చలి తీవ్రత భారీగా పెరగడంతో చాలా మంది స్నానం చేయాలంటేనే గజ గజ వణికిపోయే పరిస్థితి నెలకొంది.. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో చల్లని నీటితో స్నానం చేస్తే కలిగే లాభాలే వేరని.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చల్లటి నీటిలో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? అబ్బబ్బ ఏమన్నా లాభాలా..
Cold Water Bath Benefits
Shaik Madar Saheb
|

Updated on: Dec 17, 2025 | 6:15 PM

Share

చలి కాలం.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ సమయంలో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇంకా.. చలి తీవ్రత భారీగా పెరగడంతో చాలా మంది స్నానం చేయాలంటేనే గజ గజ వణికిపోయే పరిస్థితి నెలకొంది.. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో చల్లని నీటితో స్నానం చేస్తే కలిగే లాభాలే వేరని.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన 2022 నివేదిక ప్రకారం.. చల్లని నీరు అనేక ప్రయోజనాలను అందిస్తాయని సూచిస్తుంది. ఈ సమీక్ష చల్లని నీటి స్నానం.. ఆరోగ్య ప్రభావాలను పరిశీలించింది. ఈ డేటా సర్వే ఆధారంగా ఎన్నో పరిశోధనలు చల్లటి నీటి స్నానం గురించి అధ్యయనాలను రూపొందించాయి.. ఈ అధ్యయనాలు చల్లని నీరు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయని నిరూపించాయి.

శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుందని, శరీరానికి తగినంత ఆక్సిజన్, రక్త సరఫరా మరింత పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త కణాలు సంకోచించి, ఆపై విస్తరిస్తాయి.. రక్తం శరీరంలోని అన్ని భాగాలకు చేరుకుంటుంది.

చల్లటి నీరు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోగనిరోధక శక్తి వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. చల్లటి నీరు వాపును తగ్గిస్తుంది. చల్లటి నీరు చర్మ రంధ్రాలను మూసివేస్తుంది, చర్మాన్ని దృఢంగా, మెరిసేలా చేస్తుంది. ఇది జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది, మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

చల్లటి నీరు నేటి ఒత్తిడితో కూడిన జీవితం నుండి ఉపశమనం పొందటానికి సహకరిస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలో ఎండార్ఫిన్ల స్థాయిలను పెంచుతుంది.. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చల్లటి నీరు కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది.

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉన్నప్పటికీ, నిపుణులు కొన్ని హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు లేదా మధుమేహం ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఏమైనా ఇంకా అనారోగ్య సమస్యలుంటే.. వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
TG20: వరంగల్ టీమ్‌లోకి సిరాజ్.. భారీ ధర పలికిన తిలక్ వర్మ! సిరాజ్ ధర, తిలక్ టీమ్ వివరాలు ఇవే..
TG20: వరంగల్ టీమ్‌లోకి సిరాజ్.. భారీ ధర పలికిన తిలక్ వర్మ! సిరాజ్ ధర, తిలక్ టీమ్ వివరాలు ఇవే..
ఒకేసారి చంద్రమంగళ, గజకేసరి యోగాలు..ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు
ఒకేసారి చంద్రమంగళ, గజకేసరి యోగాలు..ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..
ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?
ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?
సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది
సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది
టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండొద్దా?
ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండొద్దా?
స్కర్ట్, హైహీల్స్‌లో ఇంజనీర్.. కోట్లాది మందిని ఆకట్టుకున్న స్టైల్
స్కర్ట్, హైహీల్స్‌లో ఇంజనీర్.. కోట్లాది మందిని ఆకట్టుకున్న స్టైల్
గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా..
గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా..
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!