CSK vs RCB IPL Match Result: తొలి మ్యాచ్‌లో చెన్నైదే విజయం.. చెపాక్‌లో బెంగళూరు చెత్త రికార్డ్..

Chennai Super Kings vs Royal Challengers Bengaluru Result, ఐపీఎల్‌ 2024: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ దూబే (34), రవీంద్ర జడేజా (25) ఐదో వికెట్‌కు అజేయంగా 66 పరుగులు జోడించి, చెన్నైను గెలిపించారు. దీంతో చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు తన రికార్డును పదిలం చేసుకుంది.  

CSK vs RCB IPL Match Result: తొలి మ్యాచ్‌లో చెన్నైదే విజయం.. చెపాక్‌లో బెంగళూరు చెత్త రికార్డ్..
Csk Vs Rcb Match Result

Updated on: Mar 23, 2024 | 12:21 AM

CSK vs RCB IPL Match Result: ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2024ను విజయంతో ప్రారంభించింది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని CSK 6 వికెట్ల తేడాతో RCBని ఓడించింది.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ దూబే (34), రవీంద్ర జడేజా (25) ఐదో వికెట్‌కు అజేయంగా 66 పరుగులు జోడించి, చెన్నైను గెలిపించారు. దీంతో చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు తన రికార్డును పదిలం చేసుకుంది.  చెపాక్‌లో చెన్నైతో జరిగిన 9 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని(కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..