IPL Auction 2026: కేకేఆర్ ధనాధన్.. కేవలం ఇద్దరికే రూ.43 కోట్లు ఖర్చు పెట్టిన షారుక్ ఖాన్ టీమ్
IPL Auction 2026: ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ దుబాయ్‌లోని ఎతిహాద్ అరేనాలో జరుగుతోంది. ఈ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు అత్యంత దూకుడుగా వ్యవహరించి, రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR), KKR మధ్య హోరాహోరీ బిడ్డింగ్ వార్ జరిగింది.

IPL Auction 2026: ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ దుబాయ్‌లోని ఎతిహాద్ అరేనాలో జరుగుతోంది. ఈ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు అత్యంత దూకుడుగా వ్యవహరించి, రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR), KKR మధ్య హోరాహోరీ బిడ్డింగ్ వార్ జరిగింది. చివరికి, కేకేఆర్ జట్టు అతన్ని రూ.25.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. 2025 వేలంలో రిషబ్ పంత్ (రూ.27 కోట్లు) తర్వాత ఇది అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడు, ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. (అయితే, ఐపీఎల్ నియమాల ప్రకారం విదేశీ ఆటగాడికి చెల్లించే గరిష్ట వేతనం రూ.18 కోట్లకే పరిమితం చేశారు, మిగిలిన మొత్తం బీసీసీఐ ప్లేయర్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు వెళ్తుంది).
కామెరూన్ గ్రీన్ తర్వాత, శ్రీలంక పేస్ సంచలనం మతీశ పతిరణా కోసం KKR మరో భారీ బిడ్డింగ్ వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన తీవ్ర పోటీలో KKR చివరి నిమిషంలో దూకి, పతిరణాను రూ.18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ ఒక్క వేలంలోనే KKR ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసం రూ.43.20 కోట్లు ఖర్చు చేసింది. ఇది వారి వ్యూహాత్మక ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది.
గతంలో ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లను కేకేఆర్ విడుదల చేయడంతో ఆక్షన్ కోసం రూ.64.30 కోట్లు అనే భారీ పర్స్‌తో రంగంలోకి దిగింది. రస్సెల్ రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన పవర్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి కామెరూన్ గ్రీన్ ఖచ్చితంగా సరిపోతాడని కేకేఆర్ భావించింది. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ కూడా గ్రీన్‌ను దక్కించుకోవడంపై చాలా సంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు గతంలో కేకేఆర్ లో ఉన్న భారత ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్, ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రూ.7 కోట్లకు అమ్ముడయ్యాడు. గ్రీన్, పతిరణాలను కొనుగోలు చేసిన తర్వాత, కేకేఆర్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం అయింది. స్లింగా యాక్షన్‌తో పతిరణా, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వంటి బౌలర్లతో కేకేఆర్ డెత్ ఓవర్స్‌లో మరింత పటిష్టంగా మారింది.
కేవలం ఇద్దరు స్టార్ ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు చేసినప్పటికీ, కేకేఆర్ ఇంకా వారి స్క్వాడ్‌లో 13 స్లాట్లు (6 ఓవర్సీస్ స్లాట్లతో సహా) నింపాల్సి ఉంది. ఈ భారీ కొనుగోళ్ల తర్వాత, కేకేఆర్ తమ మిగిలిన పర్స్‌తో (సుమారు రూ.21.10 కోట్లు ) ఆక్షన్ ముగిసేలోపు కనీసం 18 మంది ఆటగాళ్లను పూర్తి చేయవలసి ఉంది. KKR ఇప్పుడు వికెట్ కీపర్-బ్యాటర్, మరికొన్ని దేశవాళీ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




