IPL Auction: 2025 ఐపీఎల్ వేలంలో పాల్గొనబోతున్న అండర్‌రేటెడ్ టాప్ 6 ఆటగాళ్లు
ఐపీఎల్ 2025 వేలంలో ప్రతిభావంతమైన అండర్‌రేటెడ్ ఆటగాళ్లు తమ విలువను చాటుకునే అవకాశం పొందుతున్నారు. టీ. నటరాజన్, నూర్ అహ్మద్, మహేష్ తీక్షణ బౌలింగ్ లో రాణిస్తుండగా, హర్ప్రీత్ బ్రార్, వైభవ్ అరోరా, రహమానుల్లా గుర్బాజ్ ఆల్‌రౌండ్, బ్యాటింగ్ లో సత్తా చాటుతున్నారు. వీరు నిలకడైన ప్రదర్శనతో, అన్‌ట్యాప్డ్ టాలెంట్ కారణంగా ఈసారి వేలంలో ప్రాంచైజీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.
మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం షురూ కాబోతుంది. ప్రతిసారి వేలంలో అట్రాక్షన్ గా నిలిచే ప్లేయర్లు కొందరు ఉండగా.. మరికొందరు టాలెంటెడ్ ఆటగాళ్లు అండర్‌రేటెడ్ ప్లేయర్లు గానే ఉండిపోతున్నారు. ఈ ప్లేయర్లకు భారీగా ధర వెచ్చించకపోయిన కాని వాళ్లు తమ ప్రదర్శనతో మెప్పిస్తూనే ఉన్నారు. ఈ సారి కూడా ప్రాంచైజీలను ఆకర్షిస్తున్న ఆ ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.
1. టీ. నటరాజన్ (T. Natarajan)
సన్‌రైజర్స్ హైదరాబాద్ కి ఆడిన నటరాజన్ మొత్తం 43 ఐపీఎల్ మ్యాచుల్లో 8.65 ఎకానమీతో 38 వికెట్లు తీసాడు. నటరాజన్ యార్కర్లలో స్పెషలిస్ట్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ తో వికెట్లు తీయడంలో అతడు కీలకం. గతంలో గాయాల కారణంగా ఆటకు దూరమైనా, అతని అనుభవం టీమ్స్‌కు అమూల్యంగా మారవచ్చు.
2. నూర్ అహ్మద్ (Noor Ahmed)
మునుపటి సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన అహ్మద్ 18 ఏళ్ల వయసులోనే 10 ఐపీఎల్ మ్యాచులు ఆడి 7.8 ఎకానమీ రేట్ తో 11 వికెట్లు తీసాడు. లెగ్-స్పిన్‌లో అనేక వేరియేషన్లు చూపించగల అతని వికెట్ తీసే సామర్థ్యం ఫ్రాంచైజీలకు కీలకంగా మారుతుంది.
3. వైభవ్ అరోరా (Vaibhav Arora)
కొత్త బంతితో స్వింగ్ బౌలింగ్ చేయడంలో నైపుణ్యం కలిగిన వైభవ్, ఆరంభంలో వికెట్లు తీయడంలో నిపుణుడు. పంజాబ్ కింగ్స్ లో 9 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అరోరా 8 వికెట్లు పడగొట్టి 8.21 ఎకానమీ రేట్ తో కొనసాగుతున్నాడు. అతని ప్రతిభ ఐపీఎల్‌లో అతన్ని కీలక బౌలర్‌గా మార్చవచ్చు.
4. హర్ప్రీత్ బ్రార్ (Harpreet Brar)
హర్ప్రీత్ బ్రార్ మంచి టాలెంటెడ్ ఆల్‌రౌండర్. ముఖ్యంగా కీలక సమయంలో వికెట్లు తీసి, అవసరమైనప్పుడు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాడు. 7.3 ఎకానమీ రేట్ తో 32 ఐపీఎల్ మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ తరపున 18 వికెట్లు తీసాడు.
5. మహేష్ తీక్షణ (Mahesh Theekshana)
ఈ శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మధ్య ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పరుగుల వేగాన్ని నియంత్రించగలడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున 23 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 7.45 ఎకానమీ రేట్ తో 24 వికెట్లు పడగొట్టాడు.
6. రహమానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz)
11 ఐపీఎల్ మ్యాచ్‌లు, 227 పరుగులు, 136.74 స్ట్రైక్ రేట్ తో వేగంగా పరుగులు చేయడంలో ప్రసిద్ధి చెందిన గుర్బాజ్, వికెట్ కీపింగ్‌లోనూ సమర్థుడు. కోల్‌కతా నైట్ రైడర్స్ లో గత సీజన్లో ఆడిన గర్భాజ్ పవర్‌ప్లేలో అతని దూకుడు బ్యాటింగ్ జట్టకు అదనపు బలాన్ని చేకుర్చింది.
ఈ ఆరుగురు ఆటగాళ్లు తమను తాము నిరూపించుకుంటూనే జట్ల విజయాల్లో కీలకంగా మారే సత్తా ఉన్న ప్లేయర్లే. వీరిలోని ప్రతిభను గుర్తించి ఈ సారైనా భారీ ధరకు దక్కించుకుంటారని వారు ఈ అండర్‌రేటెడ్ ప్లేయర్లు ఆశిస్తున్నారు.