IPL 2026 Sixes : హిట్టింగ్‌లో హైదరాబాద్‌దే హవా.. ఆఖరి స్థానంలో లక్నో.. ఏ టీమ్ ఎన్ని సిక్సర్లు కొట్టిందంటే?
IPL 2026 Sixes : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సీజన్ 46వ మ్యాచ్ ముగిసే సమయానికి, హైదరాబాద్ టీమ్ అత్యధికంగా 118 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచింది. లక్నో పరిస్థితి దారుణంగా ఉంది.

IPL 2026 Sixes : ఐపీఎల్ 2026 సీజన్ సిక్సర్ల సునామీతో హోరెత్తిపోతోంది. బౌలర్లు ఎవరైనా, స్టేడియం ఏదైనా సరే.. బ్యాటర్లు మాత్రం బంతిని స్టాండ్స్ దాటించడమే పనిగా పెట్టుకున్నారు. గత సీజన్ రికార్డులన్నీ ఈసారి తుడిచిపెట్టుకుపోయేలా కనిపిస్తున్నాయి. అయితే, ఈ సిక్సర్ల వేటలో ఏ టీమ్ సిక్సర్ల కింగ్‌గా నిలిచింది? ఏ జట్టు బ్యాటర్లు సిక్సర్ల కొట్టడంలో వెనుకబడి ఉన్నారు? తాజా గణాంకాల ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తన పవర్ హిట్టింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సీజన్ 46వ మ్యాచ్ ముగిసే సమయానికి, హైదరాబాద్ టీమ్ అత్యధికంగా 118 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 10 మ్యాచుల్లోనే ఆ జట్టుకు చెందిన 19 మంది వేర్వేరు బ్యాటర్లు కలిసి ఈ ఘనత సాధించడం విశేషం. గిల్ నేతృత్వంలోని ఈ టీమ్ మైదానంలో అడుగుపెడితే చాలు సిక్సర్ల వర్షం కురవాల్సిందే.
టాప్-3 లో పంజాబ్, రాజస్థాన్
సిక్సర్ల వేటలో పంజాబ్ కింగ్స్ (PBKS) రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్ బ్యాటర్లు 9 మ్యాచుల్లో 108 సిక్సర్లు బాదారు. ఆ జట్టులోని 15 మంది ఆటగాళ్లు సిక్సర్ల వీరులుగా మారారు. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR) మూడో స్థానంలో ఉంది. సంజూ శాంసన్ సేన 10 మ్యాచుల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకుంది. ఈ మూడు జట్లు ఇప్పటికే వంద సిక్సర్ల మార్కును దాటేసి పవర్ హిట్టింగ్‌లో తమ సత్తా చాటుతున్నాయి.
మధ్యలో ఉన్న జట్ల పరిస్థితి
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటివరకు 9 మ్యాచుల్లో 97 సిక్సర్లు కొట్టి నాలుగో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ (MI) 9 మ్యాచుల్లో 83 సిక్సర్లు బాదింది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్లు ఇప్పటివరకు 71 సిక్సర్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జట్లన్నీ టాప్-3 లోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.
చివరి వరుసలో చాంపియన్లు
ఆశ్చర్యకరంగా ధోనీ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 70 సిక్సర్లతో ఏడో స్థానంలో ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్ (GT) 69 సిక్సర్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 62 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ లిస్ట్‌లో అందరికంటే చివరన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిలిచింది. వీరు ఇప్పటివరకు కేవలం 55 సిక్సర్లు మాత్రమే కొట్టారు. సిక్సర్లు తక్కువగా కొట్టినప్పటికీ, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు టెక్నికల్ ప్లేతో మ్యాచులు గెలుస్తూ పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
