IPL 2025: లేపి తన్నించుకోవడం అంటే ఇదే.. కోహ్లీ కెలికాడు.. ఆర్సీబీకి కాలయముడయ్యాడు.!
ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ చేసిన ఓ పొరపాటు.. మొత్తం మ్యాచ్ ఆర్సీబీకి దక్కకుండా చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈగోలకు పోతే వచ్చేది ఏముండదు. మ్యాచ్ సర్వనాశనం అయిపోతుంది. ఈ లైన్ మళ్లీ నిరూపితం అయింది. ఐపీఎల్ 2025 సీజన్ 24వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగ్గా.. ఇందులో ఆర్సీబీని 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది ఢిల్లీ. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలవడానికి కెఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచిందని చెప్పడం బదులు.. చేజేతులా ఆర్సీబీ ఓడిపోయిందని చెప్పొచ్చు. తొలుత ఆర్సీబీకి మంచి ఆరంభం లభించినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఫిల్ సాల్ట్ రనౌట్ మొత్తం మ్యాచ్‌నే మార్చేసింది. ఆ తర్వాత వరుసగా వికెట్లతో విరుచుకుపడింది. అలాగే ఢిల్లీ చేజ్ చేస్తున్నప్పుడు కూడా బెంగళూరు తొలుత వికెట్లు తీసి ప్రత్యర్ధిని ఒత్తిడిలో పడేసింది. అయితే ఆ తర్వాత చెత్త బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. అలాగే కోహ్లీ అగ్రెసివ్‌నెస్ కూడా ఆర్సీబీ కొంపముంచింది.
ఒకానొక సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ 15 పరుగులకే అవుట్ అయిన క్రమంలో.. కోహ్లీ ఆనందంతో అగ్రెసివ్ అయ్యి.. కెఎల్ రాహుల్ దగ్గరకు వచ్చి మరీ సెలబ్రేట్ చేశాడు. కోహ్లీ ఓవర్ అగ్రెసివ్‌నెస్.. రాహుల్‌కు మరింత కాకపెంచింది. అందులోనూ మెగా ఆక్షన్‌కు ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఇచ్చిన ప్రామిస్‌ను పెడచెవిని పెట్టడం కెఎల్‌కు మరింత కోపాన్ని తెప్పించింది. దీంతో కసితీరా కొట్టాడు రాహుల్.. చివరిలో సిక్స్ కొట్టి.. కాంతారా మార్క్ యాక్షన్‌తో ‘దిస్ ఇజ్ మై టెర్రిటరీ’ అంటూ పరోక్షంగా కోహ్లీ, ఆర్సీబీకి కౌంటర్ ఇచ్చాడు రాహుల్.
CSK ke haar se depression me jaha rha tha kisi ne ye wala video bhej diya 😹😹 #CSKvsKKR #KKRvsCSK #DCvsRCB #KLRahul pic.twitter.com/C7uQh7KoIv
— 🚩 (@rranjan257) April 12, 2025
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..