IPL 2025: మీరు మారరా.! SRH ప్లేఆఫ్స్ చేరాలంటే.. ఆ ఇద్దరు ప్లేయర్స్ మదమెక్కిపోవాల్సిందే.. ఎవరంటే.?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ ద్వారా కంబ్యాక్ ఇచ్చి.. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలని భావిస్తోంది. మరి అలా ఉండాలంటే ఆ జట్టులో కీలక బ్యాటర్లు అయిన ఇద్దరు రెచ్చిపోయి ఆడాలి. వారెవరంటే..

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిగా మారింది సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి. గతేడాది అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న SRH.. ఈ సీజన్‌లో చతికిలబడింది. ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచి.. మిగిలిన నాలుగింటిలో ఓడిపోయి.. విమర్శలపాలవుతోంది. ఇక ముందు ఆడే ప్రతీ మ్యాచ్ సన్‌రైజర్స్‌కి చావోరేవో అని చెప్పాలి. అయితే ఈ జట్టు మళ్లీ విజయాల బాట పట్టాలంటే.. ఓ ఇద్దరు ప్లేయర్స్ మదపుటేనుగుల్లా చెలరేగి ఆడాలని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ వారెవరని అనుకుంటున్నారా.? అదేనండీ SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ.
గతేడాది వీరిద్దరే సన్‌రైజర్స్ హైదరాబాద్ మేజర్ విజయాల్లో భాగమయ్యారు. అయితే ఈసారి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విఫలమవుతూ వస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ పేలవ ఫామ్ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు అభిషేక్. ఇందులో ఒక్క సిక్స్ లేకపోవడం గమనార్హం. ఇక ట్రావిస్ హెడ్ విషయానికొస్తే.. హెడ్ మొదటి రెండు మ్యాచ్‌లు ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుసగా జట్టుకు హెడ్’ఎక్’గా మారాడు. 5 మ్యాచ్‌ల్లో కేవలం 148 పరుగులు మాత్రమే చేశాడు.
మరోవైపు ఈ ఇద్దరు ప్లేయర్స్ గతేడాది రెచ్చిపోయి మరీ ఆడారు. గత సీజన్‌లో అభిషేక్ శర్మ 16 మ్యాచ్‌ల్లో 484 పరుగులు, ట్రావిస్ హెడ్ 15 మ్యాచ్‌ల్లో 567 పరుగులు చేశాడు. ఇక ఈ ఆరంభమే SRHకి అవసరం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అగ్రెసివ్‌గా ఆడమని చెప్పాడు. కానీ రెక్‌లెస్‌గా ఆడొద్దని అన్నాడు. మరి ఈ ఇద్దరు రెక్‌లెస్‌గా వికెట్ నష్టపోకుండా ఆడితే.. మళ్లీ SRH కంబ్యాక్ ఖాయమని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.
పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కు SRH ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమ్మిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్/జయదేవ్ ఉనద్కట్, రాహుల్ చాహర్
Whatever it takes 💪#PlayWithFire | #SRHvPBKS | #TATAIPL2025 pic.twitter.com/Zp2Y2eAofe
— SunRisers Hyderabad (@SunRisers) April 12, 2025