AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఓటమికి కారణం ఇదే! ధోని నుంచి షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

ఐపీఎల్ 2025లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. రుతురాజ్ గాయంతో ధోని కెప్టెన్సీ చేపట్టాడు. ఓటమికి కారణాలను ధోని విశ్లేషిస్తూ, బ్యాటింగ్‌లో సరిపడని పార్ట్‌నర్‌షిప్స్‌, పవర్ ప్లేలో తక్కువ పరుగులు, ఒత్తిడిని నిర్వహించలేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించాడు. వచ్చే మ్యాచ్‌లలో వ్యూహాత్మక మార్పులతో విజయం సాధించాలని ధోని ఆశించాడు.

IPL 2025: కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఓటమికి కారణం ఇదే! ధోని నుంచి షాకింగ్‌ స్టేట్‌మెంట్‌
Ms Dhoni
Follow us
SN Pasha

|

Updated on: Apr 12, 2025 | 11:27 AM

ఐపీఎల్‌ 2025లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చిత్తుగా ఓడిపోయింది. రుతురాజ్‌ గాయపడటంతో ధోని మరోసారి సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. దీంతో.. సీఎస్‌కే వరుస ఓటములకు ఎండ్‌ కార్డ్‌ పడుతుందని అంతా భావించినప్పటికీ.. అలా జరగలేదు. తలా కెప్టెన్‌గా వచ్చినా సీఎస్‌కే తలరాత మారలేదంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అయితే.. మ్యాచ్‌ తర్వాత ఓటమికి కారణమైన అంశాల గురించి ధోని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రాత్రులు మా అనుకూలంగా లేవు. అయితే ఇది సవాలుతో కూడుకున్నది.. సవాలును స్వీకరించాలి.

ఈ మ్యాచ్‌లో మేం కావాల్సినన్ని పరుగులు చేయలేదు. వికెట్లు కోల్పోయినప్పుడు, ఒత్తిడి ఉంటుంది. పైగా క్వాలిటీ స్పిన్నర్లను ఎదుర్కొంటున్న సమయంలో కష్టంగానే ఉంటుంది. మ్యాచ్‌లో సరైన పార్ట్నర్‌షిప్స్‌ లభించలేదు. పవర్‌ప్లేలో తక్కువ రన్స్‌ చేసిన తర్వాత.. కండీషన్స్‌కు తగ్గట్లు ఆడాల్సింది. మాకు మంచి ఓపెనింగ్‌ జోడీ ఉంది. ప్రాపర్‌ క్రికెట్ షాట్లు ఆడతారు, కానీ, స్లాగ్ చేయరు లేదా లైన్ దాటి కొట్టడానికి ప్రయత్నించరు. కానీ, అదే సమయంలో స్కోర్‌కార్డ్ చూసి డల్‌ అవ్వకపోవడం కూడా ముఖ్యమే. మా బ్యాటింగ్‌ లైనప్‌తో పవర్‌ ప్లేలో 60 రన్స్‌ కోసం వెళ్తే.. అది మాకు చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా పార్ట్నర్‌షిప్స్‌ నిర్మిస్తూ.. మిడిల్‌ ఓవర్స్‌, చివరి ఓవర్లలో అగ్రెసివ్‌గా ఆడాలి. ఒక వేళ వికెట్లు కోల్పోతూ ఉంటే.. గేమ్‌ను నిలబెట్టేలా ఆడాలి.” అంటూ ధోని పేర్కొన్నాడు.

మొత్తంగా బ్యాటింగ్‌ సరిగా చేయకలేకపోవడం తోనే తాము ఈ మ్యాచ్‌లో ఓడిపోయినట్లు ధోని ఒప్పుకున్నాడు. మరి వచ్చే మ్యాచ్‌లో నైనా సీఎస్‌కే తన ఆట తీరును మార్చకొని విజయాల బాట పడుతుందో లేదో చూడాలి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. ఈ టార్గెట్‌ను కేకేఆర్‌ ఊదిపారేసింది. కేవలం 10.1 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలిచింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్టులు
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్టులు
ఆ స్కీమ్‌తో విశ్రాంత జీవితం ప్రశాంతం.. ది బెస్ట్ ప్లాన్ ఇదే..!
ఆ స్కీమ్‌తో విశ్రాంత జీవితం ప్రశాంతం.. ది బెస్ట్ ప్లాన్ ఇదే..!
కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఫ్లిప్‌కార్ట్‌ SASA LELE సేల్‌.. 50 శాతం తగ్గింపు!
ఫ్లిప్‌కార్ట్‌ SASA LELE సేల్‌.. 50 శాతం తగ్గింపు!
కొత్త ఫీచర్‌.. Gmailలో ఒకే క్లిక్‌తో అవాంఛిత మెయిల్స్ తొలగించండి!
కొత్త ఫీచర్‌.. Gmailలో ఒకే క్లిక్‌తో అవాంఛిత మెయిల్స్ తొలగించండి!
బంగారంలో పెట్టుబడికి ఇదే మంచి సమయం.. ఆర్థిక నిపుణుల సూచనలివే..!
బంగారంలో పెట్టుబడికి ఇదే మంచి సమయం.. ఆర్థిక నిపుణుల సూచనలివే..!
కేంద్ర క్యాబినేట్‌ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణన!
కేంద్ర క్యాబినేట్‌ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణన!
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..