AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC New Rules: ఐపీఎల్ 2025 మధ్యలో ఐసీసీ కీలక మార్పులు.. వన్డేలతోపాటు టెస్ట్‌ల్లోనూ అదరిపోయే కొత్త రూల్స్

ICC New Rules: అదే సమయంలో ఐసీసీ అండర్ -19 ప్రపంచ కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని పరిశీలిస్తోంది. అయితే, ఈ టోర్నమెంట్‌ను వన్డే ఫార్మాట్‌లోనే ఆడాలని ఒక వర్గం పట్టుదలతో ఉంది. అయితే, ఈ మార్పులు జరిగినా, అవి 2028 తర్వాతే ప్రారంభమవుతాయి.

ICC New Rules: ఐపీఎల్ 2025 మధ్యలో ఐసీసీ కీలక మార్పులు.. వన్డేలతోపాటు టెస్ట్‌ల్లోనూ అదరిపోయే కొత్త రూల్స్
Icc
Venkata Chari
|

Updated on: Apr 12, 2025 | 9:46 AM

Share

ICC New Rules: ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ 18వ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. ఇందులో భారతదేశంతో పాటు, ప్రపంచం నలుమూలల నుంచి ఆటగాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులకు ఓ కీలక వార్త అందింది. వాస్తవానికి, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ఐసీసీ వన్డే ఫార్మాట్‌లో రెండు కొత్త బంతులను ఉపయోగించాలనే నియమాన్ని మార్చాలని పరిశీలిస్తోంది. ఈ నియమాన్ని మార్చడం వలన బౌలర్లు రివర్స్ స్వింగ్ పొందడానికి సహాయపడుతుంది. దీనితో పాటు, అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించడం కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రెండు కొత్త బంతులతో ఇన్నింగ్స్ ప్రారంభం..

క్రిక్‌బజ్‌లోని నివేదిక ప్రకారం, వన్డేలలో రెండవ కొత్త బంతిని దశలవారీగా అమలు చేయాలని ఐసీసీ క్రికెట్ కమిటీ సిఫార్సుగా పరిగణిస్తున్నారు. బౌలింగ్ జట్టు రెండు కొత్త బంతులతో ప్రారంభించవచ్చు అని తెలుస్తోంది. కానీ, 25 ఓవర్ల తర్వాత వాటిలో ఒకదాన్ని మాత్రమే ఉపయోగించగలదు. ఆ రెండింటిలో తనము ఇష్టమైన బంతిని ఎంచుకునే హక్కు బౌలింగ్ టీంకు ఉంటుంది. వన్డేల్లో రెండు బంతులను ఉపయోగించాలనే నియమాన్ని క్రికెట్ ప్రపంచంలోని చాలా మంది దిగ్గజాలు విమర్శించారు. ఇందులో సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: IPL 2025: టీమిండియాలో ప్లేస్ కోసం ఖర్చీఫ్ వేసిన ఐదుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు.. లిస్ట్‌లో ప్రీతీ ఫేవరేట్

రెండు కొత్త బంతుల నియమాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు?

సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ కమిటీ తన రిపోర్ట్‌ను పూర్తి చేసింది. అంతకుముందు, తెల్లటి బంతి తరచుగా 35వ ఓవర్ నాటికి దెబ్బతింటుంది లేదా రంగు మారేది. దీనివల్ల ఇన్నింగ్స్ మధ్యలో అంపైర్లు దానిని మార్చవలసి వచ్చేది. ప్రతిపాదిత కొత్త నిబంధన ప్రకారం, 50 ఓవర్లు బౌల్ చేసే వరకు ఉపయోగించే బంతి గరిష్టంగా 37-38 ఓవర్ల పాతదిగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కొత్త నిబంధనతో వికెట్ రెండు చివరల నుంచి ఒకేసారి రెండు బంతులు వేస్తుంటారు. అంటే ప్రతి బంతి 25 ఓవర్ల వరకు ఉంటుంది. జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ సమావేశాలలో ఈ సిఫార్సుపై చర్చించే అవకాశం ఉంది.

దీనితో పాటు, టెస్ట్ క్రికెట్‌లో ఒక రోజులో పూర్తి 90 ఓవర్లను పూర్తి చేయడానికి, ఈ ఫార్మాట్‌లో కూడా ప్రతి ఓవర్ మధ్య క్లాక్‌ని ఉపయోగించవచ్చు. ఇది ఇప్పటికే వన్డే ఫార్మాట్‌లో ఉపయోగిస్తున్నారు. ఇది కూడా ప్రయోజనకరంగా నిరూపితమైంది.

ఇది కూడా చదవండి: Fastest Century in IPL: ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే.. టాప్ 5లో ప్రీతి జింటా ప్లేయర్

అదే సమయంలో ఐసీసీ అండర్ -19 ప్రపంచ కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని పరిశీలిస్తోంది. అయితే, ఈ టోర్నమెంట్‌ను వన్డే ఫార్మాట్‌లోనే ఆడాలని ఒక వర్గం పట్టుదలతో ఉంది. అయితే, ఈ మార్పులు జరిగినా, అవి 2028 తర్వాతే ప్రారంభమవుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..