AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్‌ ఛీ కొట్టింది.. పాకిస్తాన్ హగ్ ఇచ్చింది.. కట్‌చేస్తే.. తొలి మ్యాచ్‌లోనే నలుగురి పాలిట విలనయ్యాడు

Islamabad United vs Lahore Qalandars, 1st Match: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లాహోర్ ఖలందర్స్ వర్సెస్ ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగింది. తన తొలి మ్యాచ్ ఆడిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ నాలుగు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.

ఐపీఎల్‌ ఛీ కొట్టింది.. పాకిస్తాన్ హగ్ ఇచ్చింది.. కట్‌చేస్తే.. తొలి మ్యాచ్‌లోనే నలుగురి పాలిట విలనయ్యాడు
Isu Vs Lhq Jason Holder
Venkata Chari
|

Updated on: Apr 12, 2025 | 9:03 AM

Share

Islamabad United vs Lahore Qalandars, 1st Match: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైంది. లాహోర్ ఖలందర్స్ తమ తొలి మ్యాచ్‌లో పేలవమైన ఆరంభంతో ఇబ్బందులు ఎదుర్కొంది. మొత్తం జట్టు 19.2 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చింది. తన తొలి పీఎస్‌ఎల్ (PSL) మ్యాచ్ ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శనతో లాహోర్ ఖలందర్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడుతున్న హోల్డర్ నలుగురు ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. ఐపీఎల్‌లో అవకాశం రాకపోవడంతో హోల్డర్ పీఎస్‌ఎల్ వైపు మొగ్గు చూపాడు. ఇది హోల్డర్ మొదటి సీజన్. జాసన్ హోల్డర్ 2023 సంవత్సరం వరకు ఐపీఎల్‌లో ఆడుతూనే ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోలేదు.

అరంగేట్రం మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించిన హోల్డర్..

ఇస్లామాబాద్ యునైటెడ్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించాడు. అతను 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి నలుగురు ఆటగాళ్లను ఔట్ చేశాడు. PSL లో అతని మొదటి బాధితుడు మహ్మద్ నయీం. ఆ తరువాత జహందాద్ ఖాన్, డేవిడ్ వీసా, షాహీన్ షా అఫ్రిదిలను తన బాధితులుగా మార్చుకున్నాడు.

స్వల్ప స్కోర్‌కే లాహోర్ ఖలందర్స్ ఆలౌట్..

ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. టాస్ గెలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. హోల్డర్ నాయకత్వంలోని బౌలింగ్ యూనిట్ దీనిని నిజమని నిరూపించారు. అబ్దుల్లా షఫీక్ 38 బంతుల్లో 66 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా.. లాహోర్ 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా 23 పరుగులు, డారిల్ మిచెల్ 13 పరుగులు చేశారు. హోల్డర్ 4 వికెట్లు తీయడంతో పాటు, షాదాబ్ ఖాన్ 3, నసీమ్ షా, రిలే మెరెడిత్, ఇమాద్ వసీం తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేజింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్ 17.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు పడగొట్టి టార్గెట్ రీచ్ అయింది.

పీఎస్‌ఎల్ 10వ సీజన్ ప్రారంభం..

పాకిస్తాన్ సూపర్ లీగ్ 10వ ఎడిషన్ ఏప్రిల్ 11న ప్రారంభమై మే 18 వరకు కొనసాగుతుంది. ఇందులో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇది రావల్పిండి, లాహోర్, కరాచీ, ముల్తాన్ అనే 4 పెద్ద నగరాల్లో జరుగుతుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఫైనల్, ప్లేఆఫ్‌లతో సహా 12 ముఖ్యమైన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన మ్యాచ్‌లకు కరాచీ, ముల్తాన్ స్టేడియాలు ఆతిథ్యం ఇస్తాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..