IPL 2025: రిటెన్షన్ రూల్స్‌లో కీలక మార్పు.. ఆ ప్లేయర్‌కు ఏకంగా రూ. 25 కోట్లు.. పంట పండిందిపో..
IPL Retention Purse Value: ఐపీఎల్ మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేసిన ప్లేయర్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఇందుకు ఈనెల చివరి వరకు సమయం ఉంది. అయితే, మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. అందులో ఒక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ను కలిగి ఉండటం తప్పనిసరిగా చేసింది.
IPL Retention Purse Value: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ కోసం మెగా వేలం జరగాల్సి ఉంది. దానికి ముందు అన్ని జట్లు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31 నాటికి సమర్పించాల్సి ఉంది. హెన్రిచ్ క్లాసెన్‌ను రిటైన్ చేసుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.23 కోట్లు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా వెల్లడైంది. ఆ తర్వాత, ఫ్రాంచైజీలు మిగిలిన రూ. 75 కోట్లను ఎలా ఉపయోగించుకుంటాయనే ప్రశ్నలు మొదలయ్యాయి.
రిటైన్ చేసిన ఆరుగురు ఆటగాళ్లలో ఒక క్యాప్డ్ ప్లేయర్ తప్పనిసరి..
మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ జట్లకు స్వేచ్ఛను ఇచ్చింది. అందులో ఒక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. బోర్డు ప్రకారం, జట్లు మొదటి ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్‌లకు రూ. 18, రూ.14, రూ.11 కోట్లు ఇవ్వనుండగా.. చివరి ఇద్దరికి రూ. 18, 14 కోట్లు వెచ్చించవచ్చు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకోవడానికి జట్లు కేవలం రూ.4 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, జట్లు కోరుకుంటే రూ.75 కోట్లను ఐదుగురు ఆటగాళ్లకు మాత్రమే ఖర్చు చేయవచ్చు.
కేవలం ఐదుగురు ఆటగాళ్లకు రూ.75 కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?
The IPL franchises can divide the 75cr retention amount among 5 capped players. (Espncricinfo).
– If player A is retained at 25cr, B at 20cr, C at 15cr – then player D & E can be retained in the remaining 15cr. pic.twitter.com/8SB1ANreir
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 16, 2024
ఫ్రాంచైజీలు కోరుకుంటే తమ డబ్బును క్యాప్డ్ ఆటగాళ్లకు మాత్రమే ఖర్చు చేయవచ్చు. ఒక జట్టు మొదటి ఇద్దరు ఆటగాళ్లను నిలబెట్టుకోవడానికి రూ.25 కోట్లు లేదా రూ.20 కోట్లు ఖర్చు చేసి, ఆపై మూడో ఆటగాడికి రూ.15 కోట్లు ఖర్చు చేసిందనుకుందాం. అప్పుడు మొత్తం ఖర్చు రూ.60 కోట్లుగా మారనుంది. ఇటువంటి పరిస్థితిలో మిగిలిన ఇద్దరు ఆటగాళ్లను రూ. 15 కోట్లకు మాత్రమే ఉంచుకోవాలి. అయితే, ఇందుకోసం వారు తమ ఆటగాళ్లను తక్కువ డబ్బుతో తమ వద్ద ఉంచుకునేలా ఒప్పించాల్సి ఉంటుంది. రిటైన్ జాబితా రావడానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. కాబట్టి ఫ్రాంచైజీలు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తాయనేది ఆసక్తిగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..