AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH: రికార్డు సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే.. సీన్ కట్ చేస్తే.!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది చతికిలబడింది. 300 లోడింగ్ అంటూ పెరిగిన భారీ అంచనాలు మొదటికే మోసం తెస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో కేవలం ఒకదానిలో మాత్రమే గెలిచి.. నాలుగింటిలో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ వివరాలు..

SRH: రికార్డు సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే.. సీన్ కట్ చేస్తే.!
Srh Team
Ravi Kiran
|

Updated on: Apr 07, 2025 | 4:57 PM

Share

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఇప్పుడు SRH పరిస్థితి ఇదే. గత ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ చెలరేగి మరీ ఆడారు. ఆ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్‌లో SRHపై అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. ఈసారి ఆరెంజ్ ఆర్మీ కచ్చితంగా కప్పు కొడుతుందని ధీమాగా ఉండగా.. జట్టు ప్రదర్శన మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్‌లలో కనీసం ప్రత్యర్ధికి పోటీ ఇవ్వలేకపోయింది. 300 లోడింగ్ అంటూ భారీ స్కోర్ల మాట అటుంచితే.. కనీసం మ్యాచ్ గెలిచే ప్రదర్శన కూడా చేయలేని స్థితికి చేరింది. సన్‌రైజర్స్ ఓటములకు కారణాలు చాలానే ఉన్నాయి. ఆ జట్టు దూకుడునే నమ్ముకోవడం.. SRH ఓటములకు ప్రధాన కారణం. బ్యాటర్లు పిచ్‌తో సంబంధం లేకుండా మొదటి బంతి నుంచి దూకుడైన ఆటతీరునే నమ్ముకుని బోల్తా కొడుతున్నారు.

గతంలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసేవారు. ఇప్పుడు మహమ్మద్ షమీ తన స్థాయిలో రాణించట్లేదు. అంతేకాదు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా వికెట్లు తక్కువ తీయడం.. భారీగా పరుగులివ్వడం జరుగుతోంది. ఇక వికెట్ టేకింగ్ స్పిన్నర్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో లేరు. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ లాంటి మంచి స్పిన్నర్లు ఉన్నా.. జట్టులోకి తీసుకోకపోవడం దెబ్బ కొడుతోంది. ప్రతీసారి 300 లోడింగ్ అంటూ సాగే అంచనాలు మొదటికే మోసం తెస్తున్నాయి. ఓవరాల్‌గా గతేడాది రికార్డు సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే అనేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఇప్పుడు తన అగ్రెసివ్ అప్రోచ్‌తోనే బొక్కబోర్లా పడుతోంది. ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లో గెలిచి.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..

డబ్ల్యూటీసీలో ఆసీస్‌కు గట్టి షాక్.. భారత్ అవుట్.!
డబ్ల్యూటీసీలో ఆసీస్‌కు గట్టి షాక్.. భారత్ అవుట్.!
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..