AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ధోని కోసం రూల్స్ మార్చేసిన బీసీసీఐ.. ఐపీఎల్‌ 2025లో మరోసారి ‘మహి’ మ్యాజిక్..

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు, 5 సార్లు ఛాంపియన్ అయిన ఎంఎస్ ధోని మళ్లీ మైదానంలోకి వస్తాడా లేదా అని తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. గత సీజన్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి, టైటిల్‌ను కోల్పోయిన కారణంగా, ధోనీ తన కెరీర్‌ను టైటిల్‌తో ముగించలేడా అనే బాధ మిలియన్ల మంది అభిమానుల హృదయాల్లో ఉంది. వచ్చే సీజన్‌లో తమ ప్రియమైన 'తలా' ఆడే అవకాశాలు పెరిగినందున ధోని అభిమానులు ఇప్పుడు ఈ విషయంలో ఉపశమనం పొందవచ్చు.

IPL 2025: ధోని కోసం రూల్స్ మార్చేసిన బీసీసీఐ.. ఐపీఎల్‌ 2025లో మరోసారి 'మహి' మ్యాజిక్..
Csk Ipl 2025 Auction
Venkata Chari
|

Updated on: Sep 29, 2024 | 11:18 AM

Share

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు, 5 సార్లు ఛాంపియన్ అయిన ఎంఎస్ ధోని మళ్లీ మైదానంలోకి వస్తాడా లేదా అని తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. గత సీజన్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి, టైటిల్‌ను కోల్పోయిన కారణంగా, ధోనీ తన కెరీర్‌ను టైటిల్‌తో ముగించలేడా అనే బాధ మిలియన్ల మంది అభిమానుల హృదయాల్లో ఉంది. వచ్చే సీజన్‌లో తమ ప్రియమైన ‘తలా’ ఆడే అవకాశాలు పెరిగినందున ధోని అభిమానులు ఇప్పుడు ఈ విషయంలో ఉపశమనం పొందవచ్చు. ఎంఎస్ ధోనిని కొనసాగించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ డిమాండ్ చేసిన ‘అన్ క్యాప్డ్ ప్లేయర్’ నిబంధనను ఐపీఎల్‌లో మళ్లీ అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

తిరిగొచ్చిన అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ రూల్..

సెప్టెంబర్ 28, శనివారం, బెంగళూరులో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనిలో ఈ సంవత్సరం మెగా వేలం కోసం ఆటగాళ్ల రిటెన్షన్, వేలం పర్స్ సహా అనేక నియమాలు నిర్ణయించింది. నివేదికల ప్రకారం, ఈసారి BCCI రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. డైరెక్ట్ రిటెన్షన్ లేదా రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ ద్వారా వారిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అంటే, ఫ్రాంచైజీకి కావాలంటే, అది ఆరుగురు ఆటగాళ్లను ముందుగానే రిటైన్ చేసుకోవచ్చు లేదా మెగా వేలంలో RTM ద్వారా రిటైన్ చేసుకోవచ్చు లేదా రెండింటిని కలిపి కూడా చేయవచ్చు.

అయితే, బోర్డు కనీసం ఒక్కరు, గరిష్టంగా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను ఉంచుకునే నియమాన్ని కూడా ఉంచింది. ఈ ప్రయోజనం సాధారణంగా యువ ఆటగాళ్లకు లేదా టీమ్ ఇండియా కోసం అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాళ్లకు ఇవ్వనున్నారు. ఈసారి ఎంఎస్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ దీని నుంచి ప్రయోజనం పొందవచ్చు. వాస్తవానికి, 2021 వేలానికి ముందు రద్దు చేసిన ఈ నిబంధనను తిరిగి ప్రవేశపెట్టాలని BCCI నిర్ణయించిందని ESPN-Cricinfo నివేదికలో వెల్లడించింది. ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లుగా పరిగణించాలనేది ఈ నిబంధన.

ధోనీ, సీఎస్‌కే లాభం..

ధోని ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యాడు. కానీ, జులై 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో, మెగా వేలానికి ముందు, అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ విధంగా అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలుపుకోవచ్చు. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు రిటెన్షన్ ఫీజు ఇప్పటికీ రూ.4 కోట్లుగా ఉంచింది. ఇటువంటి పరిస్థితిలో, CSK కేవలం రూ. 4 కోట్లు చెల్లించి ధోనిని నిలుపుకోగలదు. దాని కారణంగా ధోనిని జట్టులో ఉంచుకోగలుగుతారు. అతనిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు.

వాస్తవానికి, ఈ నియమం IPL ప్రారంభం నుంచి లీగ్‌లో భాగంగా ఉంచారు. కానీ, అది ఎప్పుడూ ఉపయోగించలేదు. కాబట్టి ఇది 2021లో రద్దు చేశారు. ఇప్పుడు దీన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణం ధోని. వాస్తవానికి, జులైలో రిటెన్షన్ నిబంధనలకు సంబంధించి బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానుల మధ్య సమావేశం జరిగింది. ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించేందుకు వీలుగా అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల నిబంధనను మళ్లీ చేర్చాలని ఈ సమావేశంలో CSK BCCIని కోరినట్లు నివేదిక పేర్కొంది. అయితే, ఫ్రాంచైజీ అటువంటి వాదనలను తిరస్కరించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి
మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి
పాత ఫోన్ విక్రయిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అర్ధరాత్రి థ్రిల్ కోసం స్పీడ్ రైడ్.. తెల్లారేసరికి బ్రేకింగ్ NEWS
అర్ధరాత్రి థ్రిల్ కోసం స్పీడ్ రైడ్.. తెల్లారేసరికి బ్రేకింగ్ NEWS
భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?
భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?
ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
కాశీ-అయోధ్య యాత్రకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. 9 రోజుల్లో 5 పవిత్ర
కాశీ-అయోధ్య యాత్రకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. 9 రోజుల్లో 5 పవిత్ర
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..