Telangana: కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు.. అసలు విషయం తెలిసి అంతా షాక్!

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు గంటలపాటు ఓ యువకుడు హంగామా సృష్టించాడు. వినోద్ అనే యువకుడు కరెంట్ పోల్ ఎక్కి అటు పోలీసులను, ఇటు స్థానికులను ముప్పు తిప్పలు పెట్టాడు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వస్తే గానీ కరెంట్ పోల్ దిగనంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి జగ్గారెడ్డి వచ్చి యువకుడిని కిందికి రప్పిచ్చి ఆరా తీశారు. దీంతో యువకుడు చెప్పిన మాటలకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Telangana: కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు.. అసలు విషయం తెలిసి అంతా షాక్!
Young Man On Pole
Follow us
P Shivteja

| Edited By: Balaraju Goud

Updated on: Dec 21, 2024 | 3:46 PM

మద్యం మత్తుల్లో కొంతమంది చేసే పనులు చాలా గమ్మత్తుతో పాటు.. కొంత టెన్షన్గా కూడా ఉంటాయి. కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా సోయి ఉండదు. అచ్చం ఇలాంటి ఘటన ఒకటి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది.ఓ యువకుడు పట్టపగలు కరెంట్ పోల్ ఎక్కి హల్చల్ చేశాడు. రెండు గంటల పాటు స్థానికులతో పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వినోద్ అనే యువకుడు కరెంట్ పోల్ ఎక్కి అటు పోలీసులను, ఇటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టాడు. రెండు గంటల పాటు కరెంట్ పోల్ పైనే ఉండి, అందరికి ముచ్చెమటలు పెట్టించాడు దీనికి కారణం ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే..! వినోద్ నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన తండ్రి ఇంట్లో నుండి వెళ్లిపోమ్మన్నాడు. తండ్రి మాటలకు మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ.. కరెంట్ పోల్ ఎక్కి.. నిరసనకు దిగాడు. ఎంతకీ కరెంట్ పోల్ దిగకుండా, సుమారు 2 గంటల పాటు హంగామా సృష్టించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యువకుడికి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. తాను కరెంట్ పోల్ దిగాలంటే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రావాలని, అతను వస్తేనే కరెంట్ పోల్ దిగుతానని మారాం చేశాడు. కరెంట్ పోల్ పైన నుండి చిట్టిలు రాసి కింద ఉన్న పోలీసులకు వేశాడు వినోద్. ఇదే ఫైనల్ అని, ఈ విషయంలో ఇక ఎవరు చెప్పినా విననని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాకుంటే కరెంట్ పోల్ పైనుండి దూకేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చి నచ్చజెప్పడంతో చివరికి కరెంట్ పోల్ పైనుండి కిందకు దిగాడు వినోద్.

వీడియో చూడండి.. 

2 గంటల తరువాత వినోద్ కరెంట్ పోల్ దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. ఇక వినోద్ కి లక్కీ ఏంటి అంటే.. తాను కరెంట్ పోల్ ఎక్కినప్పుడు..దాని పైన ఉన్నంత సేపు కరెంట్ లేకపోవడమే..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..