ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు కంటైనర్ కింద నలిగిపోయిన కారు.. ఆరుగురు దుర్మరణం!

బెంగళూరులోని జాతీయ రహదారి 4పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ ట్రక్కు అదుపు తప్పి కారుపై బోల్తా పడడంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా లారీ ఆటోను కారుపై పడిపోయింది. కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు చంద్రం అగప్పగోల్ IAST సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని కుటుంబంగా గుర్తించారు పోలీసులు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు కంటైనర్ కింద నలిగిపోయిన కారు.. ఆరుగురు దుర్మరణం!
Bengaluru Road Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 21, 2024 | 3:05 PM

బెంగళూర్‌ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరె గ్రామంలో వరుసగా రెండు ట్రక్కులు ఢీకొట్టుకున్నాయి. మధ్యలో ఉన్న కారుపై కంటైనర్‌ పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది.

బెంగళూరులోని జాతీయ రహదారి 4పై ఈ ప్రమాదం జరిగింది. తుమకూరు నుంచి బెంగళూరుకు లారీ వస్తోంది. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనకుండా ఉండేందుకు డ్రైవర్ లారీని కుడివైపుకు తీసుకెళ్లాడు. దీంతో లారీ బెంగుళూరు నుంచి తుమకూరు వెళ్లే రోడ్డుపైకి వచ్చి కారుపై నుంచి పడింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 6 మంది కారులో చిక్కుకున్నారు. బెంగళూరు రూరల్ ఎస్పీ సీకే బాబాతోపాటు ఇతర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సహకారంతో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. కారులో ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించారు. పూర్తిగా ధ్వంసమైన కారు బెంగుళూరు రిజిస్ట్రేషన్‌ను కలిగి ఉంది. మరణించిన ఆరుగురు విజయపూర్‌కు చెందినవారిగా గుర్తించారు.

వోల్వో కారులో ఒకే కుటుంబానికి చెందిన 6 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తున్న చంద్రం ఎగప్పగోల్‌ కుటుంబం ఈ ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. చంద్రం అగప్పగోల్ IAST సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని. చంద్రం ఇటీవలె వోల్వో కారును కొనుగోలు చేశారు. మృతులను చంద్రం ఎగప్పగోల్ (46), అతని భార్య ధోరబాయి (40), కుమారుడు జ్ఞాన్ (16), కుమార్తెలు దీక్ష (10), ఆర్య (6) చంద్రం ఎగప్పగోల్ సోదరుడి భార్య విజయలక్ష్మి (35) గా గుర్తించారు. యాక్సిడెంట్‌పై నెలమంగళ మొబైల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయ్యింది. చంద్రం ఎగప్పగోల్ వాస్తవానికి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా జాట్ తాలూకాలోని మోరబాగి గ్రామ నివాసి మరియు బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివసిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..