ఈ కోమలి వద్ద అందం దాస్యం చేస్తుంది.. క్యూటీ అనిక..

21 December 2024

Battula Prudvi

నవంబర్ 27, 2004న కేరళలోని మంజేరిలో సురేందర్ త్రిచూర్ ముత్తువర, రజిత సురేంద్రన్ దంపతులకు జన్మించింది క్యూటీ అనిక సురేంద్రన్.

ఆమెకు అంకిత్ సురేంద్రన్ అనే అన్నయ్య ఉన్నాడు, అతను కేరళలోని అక్యూబిట్స్ టెక్నాలజీస్‌లో క్యాంపస్ పార్టనర్ గా పనిచేస్తున్నాడు.

విజయ్ దేవరకొండ, మోహన్‌లాల్, నాని, టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్ ఈ బ్యూటీ అభిమాన నటులు. రష్మిక మందన్న ఫేవరెట్ హీరోయిన్.

పాస్తా, పొంగల్ అంటే చాల ఇష్టమని, ఇటాలియన్ వంటకాలు కూడా ఇష్టంగా తింటానని ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

2007లో చోటా ముంబై అనే ఓ మలయాళీ సినిమాతో సినీ అరంగేట్రం చేసింది. దీనికి 500 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది.

ఫోర్ ఫ్రెండ్స్, రేస్, 5 సుందరికల్ నయన, ఒన్నుమ్ మిందాతే వంటి మరికొన్ని మలయాళ చిత్రాలలో కనిపించింది ఈ వయ్యారి.

2014 సంవత్సరంలో అయ్యప్ప ధింతకా అనే ఓ తమిళ ఆధ్యాత్మిక మ్యూజిక్ వీడియోలో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ అందాల తార. వీటిని కాస్త కుర్రాళ్ల సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.