సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్.. మిస్సయిన మూవీ..
20 December 2024
Battula Prudvi
తాజాగా సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన పుష్ప 2 ది రూల్ భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.
గతంలో బన్నీ, సుకుమార్ కాంబోలో ఆర్య సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇది సుకుమార్ డైరెక్టరల్ డెబ్యూ మూవీ.
సుకుమార్ సెకండ్ మూవీ ‘జగడం’ సినిమాని రామ్ పోతినేని హీరోగా తెరకెక్కించారు. ఇది అంతగా ప్రేక్షలను మెప్పించలేకపోయింది.
ఈ మూవీని మొదటిగా మహేష్ బాబు ఆ తర్వాత అల్లుఅర్జున్ పేర్లు అనుకున్నారు. చివరికి బన్నితో చేయాలనీ కథతో పాటు అన్ని సిద్ధం చేశారు.
దిల్‌రాజుతో చిన్న సమస్యతో రాత్రికి రాత్రే రామ్‌కు కథ చెప్పి ఒకే చేయించచి తర్వాతి రోజే ముహూర్తం పెట్టించి ముహూర్త సన్నివేశానికి బన్నిని, రాజుగారిని ఆహ్వానించారు.
అక్కడకు వచ్చిన రాజుగారు ఆయన్ని తిట్టగా ‘మీరు కథలో ఆ మార్పు చేయాలి.. ఈ మార్పు చేయాలి’ అంటే కుదరదు అని చెప్పారు సుకుమార్.
రామ్ పాత్ర బన్ని లేదా మహేష్‌కి బాగుండేది. తమ్ముడి పాత్రకు రామ్ సరిపోయేవాడు. కానీ, ఆలా జరగలేదు. ‘జగడం’ ఫ్లాప్‌తో నాలో మార్పు వచ్చింది అన్నారు సుకుమార్.
అప్పటి నుంచి ఎవరు ఏది చెప్పినా విని నిర్ణయం తీసుకుంటున్న అంటూ ‘జగడం’ మెమోరీస్ ఓ సందర్భంలో పంచుకున్నారు సుకుమార్.