అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణను శక్తిమంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా మార్చిన చిత్రం ‘నరసింహ’.
ఈ సినిమాలో ఈమె రజనీకాంత్‌కు ప్రతినాయకురాలిగా చేసిన నీలాంబరి పాత్ర ఆమెకి స్టార్‌డమ్‌తో విమర్శకుల ప్రశంసలు లభించాయి.
అయితే నరసింహా మూవీలో తాను చేసిన నీలాంబరి పాత్రపై ఓ సందర్భంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రమ్యకృష్ణ.
నీలాంబరి పాత్రను చేయడం మొదట్లో ఆమెకు ఇష్టం లేదని, ఎందుకంటే తల పొగరు ఎక్కువగా ఉన్నట్లు ఆ పాత్రను తీర్చిదిద్దారని అన్నారు.
అయితే అది కేవలం సినిమాలోని పాత్రే అయినప్పటికీ ‘నీకు నీలాంబరి పాత్ర కావాలా? సౌందర్య పాత్ర కావాలా?’ అని అడిగితే సౌందర్య పాత్రే ఓకే చేసేదాన్ని అని చెప్పారు.
ఈ చిత్రంలో సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు ఆమె చాలా ఇబ్బందిపడ్డానని తెలిపారు.
కానీ, దర్శకుడి విజన్‌ను నమ్మా కాబట్టి ఆ పాత్రను అంత బాగా చేయగలిగా’’ అని చెప్పుకొచ్చరు రాజమాత శివగామి.
నరసింహాలోని నీలాంబరి నుంచి బాహుబలిలో శివగామి వరకు ఎన్నో శక్తివంతమైన మహిళా పాత్రలకి ప్రాణం పోశారు రమ్యకృష్ణ.