ఈ ఏడాది పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే.. 

20 December 2024

Battula Prudvi

ఈ ఏడాది మొదటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు.

తర్వాత ఆరు నెలల గ్యాప్ లో వచ్చిన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‎బస్టర్‎గా ప్రభంజనం సృష్టించింది.

ఈ జాబితాలో ఉన్న మరో తెలుగు చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

తాజాగా ఈ 2024 పాన్ ఇండియా బ్లక్‎బస్టర్ లిస్ట్‎లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ చేరింది.

ఈ జాబితాలో చీరిన తొలి హిందీ బ్లక్‎బస్టర్ చిత్రం ‘ముంజ్య’. ఈ హారర్ కామెడీ హిందీతో పాటు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2024 పాన్ ఇండియా బ్లక్‎బస్టర్ లిస్ట్‎లో చోటు దక్కించుకున్న మరో హిందీ హారర్ చిత్రం శ్రద్ధ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించిన ‘స్త్రీ 2’.

ఈ జాబితాలో మలయాళీ చిత్రం పృద్విరాజ్ సుకుమార్ నటించిన ‘ది గోట్ లైఫ్’. ఇది తెలుగులో ‘అడుజీవితం’ పేరుతో విడుదలైంది.

ఈ ఏడాది పాన్ ఇండియా బ్లక్‎బస్టర్ సినిమాలు లిస్ట్‎లో మరో మలయాళీ అడ్వెంచర్స్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’.