IPL 2024: కేకేఆర్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఐపీఎల్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణమిదే

ఐపీఎల్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కావొచ్చునేనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న అయ్యర్ మరోసారి వెన్ను నొప్పి బారిన పడ్డాడు. గాయం తీవ్రంగా ఉంటే మాత్రం అయ్యర్ ఐపీఎల్ కు పూర్తిగా దూరమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి

IPL 2024: కేకేఆర్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఐపీఎల్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణమిదే
Shreyas Iyer

Updated on: Mar 14, 2024 | 12:54 PM

ఐపీఎల్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కావొచ్చునేనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న అయ్యర్ మరోసారి వెన్ను నొప్పి బారిన పడ్డాడు. గాయం తీవ్రంగా ఉంటే మాత్రం అయ్యర్ ఐపీఎల్ కు పూర్తిగా దూరమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే కేకేఆర్ కు భారీ ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు. ముంబై, విదర్భ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్‌లో శ్రేయస్ బాగానే ఆడాడు. 95 పరుగులు చేసి తన జట్టుకు భారీ స్కోరును అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో వెన్ను నొప్పితో విలవిల్లాడాడు. నివేదికల ప్రకారం, అయ్యర్ వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతను గత సంవత్సరం శస్త్రచికిత్సకూడా చేయించుకున్నాడు. అయితే ఇప్పుడీ గాయం తిరగబెట్టిందని, దీంతో IPL 2024 ప్రారంభ మ్యాచ్‌లకు శ్రేయస్ దూరం కావొచ్చని వార్తలు వస్తున్నాయి.

‘శ్రేయాస్ అయ్యర్ కు వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టింది. అతను రంజీ ట్రోఫీ ఫైనల్ 5వ రోజు మైదానంలోకి వచ్చే అవకాశం లేదు. అలాగూ IPL ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే ప్రమాదం ఉంది’ టీమ్ సిబ్బంది ఒకరు చెప్పుకొచ్చారు. IPL 2024 ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కానుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌తో ఈ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభమవుతుంది. ఇక రెండుసార్లు మాజీ ఛాంపియన్‌గా నిలిచిన KKR మార్చి 23న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. కాగా ఇదే వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ మొత్తం 2023 సీజన్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీతో నితీష్ రాణాను జట్టు కెప్టెన్‌గా జట్టును నడిపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..