KKR vs SRH, IPL 2024: విజృంభించిన మిచెల్ స్టార్క్.. కుప్పకూలిన హైదరాబాద్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతోన్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు నిరాశ పర్చారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో55, 7 ఫోర్లు, 1 సిక్స్‌), హెన్రిచ్‌ క్లాసెన్ ( 21 బంతుల్లో32, 3 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మరెవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు

KKR vs SRH, IPL 2024: విజృంభించిన మిచెల్ స్టార్క్.. కుప్పకూలిన హైదరాబాద్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
KKR vs SRH, IPL 2024

Updated on: May 21, 2024 | 9:35 PM

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతోన్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు నిరాశ పర్చారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో55, 7 ఫోర్లు, 1 సిక్స్‌), హెన్రిచ్‌ క్లాసెన్ ( 21 బంతుల్లో32, 3 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మరెవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (3), నితీశ్‌ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్‌ (0), సన్వీర్ సింగ్ (0) తీవ్ర నిరాశపర్చారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి సన్ రైజర్స్ హైదరాబాద్ 126 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అయితే ఆఖరులో కెప్టెన్ కమిన్స్ (24 బంతుల్లో30, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసిన్ని మెరుపులు మెరిపించాడు. దీంతో ఎస్ఆర్ హెచ్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు. మరి హైదరాబాద్ బౌలర్లు ఈ పరుగులను కాపాడుకుంటారా?లేదా? అన్నది మరికాసేపట్లో తేలనుంది.

 

ఇవి కూడా చదవండి

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

ఇంపాక్ట్  ప్లేయర్లు:

అంకుల్ రాయ్, మనీష్ పాండే, నితీష్ రాణా, KS భరత్, షెర్ఫైన్ రూథర్‌ఫోర్డ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, జయదేవ్ ఉనద్కత్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..