- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Good News For RCB.. RR's Jos Buttler Unavailable For Eliminator Clash
RR vs RCB, IPL 2024: ఆర్సీబీకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న రాజస్థాన్
ఐపీఎల్ సీజన్ 17 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం (మే 22) రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. క్వాలిఫయర్స్‌లోకి ప్రవేశించేందుకు కీలకమైన ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఐపీఎల్‌కు దూరమవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్.
Updated on: May 21, 2024 | 10:49 PM

ఐపీఎల్ సీజన్ 17 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం (మే 22) రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. క్వాలిఫయర్స్‌లోకి ప్రవేశించేందుకు కీలకమైన ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఐపీఎల్‌కు దూరమవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్.

ఇలాంటి కీలక మ్యాచ్‌కు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అందుబాటులో లేడు. పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ కోసం బట్లర్ ఇంగ్లండ్ వెళ్లాడు, కాబట్టి అతను RCBతో మ్యాచ్‌లో అందుబాటులో లేడు.

జోస్ బట్లర్ అందుబాటులో లేకపోవడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త ఆందోళన కలిగిస్తే, RCB జట్టు కు మాత్రం శుభ వార్తే. ఎందుకంటే లీగ్ దశలో RCBతో జరిగిన మ్యాచ్‌లో RR విజయం సాధించింది. ఈ విజయంలో జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇచ్చిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్‌లో జోస్ బట్లర్ అజేయ సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో చివరి ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో బట్లర్ అందుబాటులో లేకపోవడం ఆర్‌సీబీకి ప్లస్ పాయింట్ అవుతుంది.

దీని ప్రకారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించి 2వ క్వాలిఫయర్ దశకు చేరుకోవడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. RCB 2వ క్వాలిఫయర్‌లోకి ప్రవేశిస్తే, KKR, SRH మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టును ఎదుర్కొంటుంది.