AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Records: 2 జట్లు, 5 టైటిల్స్.. ఐపీఎల్‌లో ధోని సాటిలేని 11 రికార్టులివే..

MS Dhoni IPL Records: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోనీ నిలిచాడు. అంటే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 5 సార్లు టైటిల్ అందించాడు. ధోనీ ఐపీఎల్‌లో ఎన్నో ప్రత్యేకమైన రికార్డులను కలిగి ఉన్నాడు. వాటిని బద్దలు కొట్టడం అసాధ్యం. ఐపీఎల్‌కు సంబంధించిన ధోనీ రికార్డులను ఓసారి చూద్దాం..

MS Dhoni Records: 2 జట్లు, 5 టైటిల్స్.. ఐపీఎల్‌లో ధోని సాటిలేని 11 రికార్టులివే..
Ms dhoni Ipl Records
Venkata Chari
|

Updated on: Mar 18, 2024 | 6:43 PM

Share

MS Dhoni IPL Records: ఐపీఎల్ 17వ సీజన్‌లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించేందుకు ఎంఎస్ ధోని సిద్ధమయ్యాడు. అతని జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మార్చి 22న సీజన్ ప్రారంభ మ్యాచ్ ఆడనుంది. 42 ఏళ్ల వయసులో సీఎస్‌కే ఆరోసారి ఛాంపియన్‌గా నిలవాలనే ఉద్దేశంతో ధోనీ రంగంలోకి దిగనున్నాడు. ఈ సీజన్‌ను అతని చివరి ఐపీఎల్‌గా కూడా పరిగణిస్తున్నారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోనీ నిలిచాడు. అంటే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 5 సార్లు టైటిల్ అందించాడు. ధోనీ ఐపీఎల్‌లో ఎన్నో ప్రత్యేకమైన రికార్డులను కలిగి ఉన్నాడు. వాటిని బద్దలు కొట్టడం అసాధ్యం. ఐపీఎల్‌కు సంబంధించిన ధోనీ రికార్డులను ఓసారి చూద్దాం..

రెండు జట్ల తరపున ఆడిన ధోని..

లీగ్ మొదటి సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ధోనీ జతకట్టాడు. అప్పటి నుంచి చెన్నై ధోనీకి రెండవ ఇల్లుగా పరిగణించారు. అతను ప్రారంభ సీజన్ నుంచి CSKతో ఉన్నాడు. కానీ, అతను మరొక జట్టుతో కూడా రెండు సీజన్లు ఆడవలసి వచ్చింది. ఐపీఎల్‌లో చెన్నైతో పాటు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరపున కూడా ధోని ఆడాడు.

ఇవి కూడా చదవండి

స్పాట్ ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా రెండేళ్ల పాటు నిషేధానికి గురైంది. ఆ తర్వాత రెండు కొత్త ఫ్రాంచైజీలు పూణె, గుజరాత్ లయన్స్ రెండు సీజన్లలో లీగ్‌లోకి ప్రవేశించాయి. 2016లో పుణె తరపున ఆడాడు. ఈ జట్టు కోసం, అతను రెండు సీజన్లలో 30 మ్యాచ్‌లలో 574 పరుగులు చేశాడు. 2018లో చెన్నై తిరిగి రావడంతో, ధోనీ కూడా తన పాత జట్టుకు తిరిగి వచ్చాడు. పునరాగమన సీజన్‌లో అతను జట్టు ఛాంపియన్‌గా నిలిపాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన..

విజేతగా నిలిచిన సీజన్‌లు 2010, 2011, 2018, 2021, 2023

ధోనీ పేరిట ఐపీఎల్‌లో భారీ రికార్డులు..

ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున అత్యధికంగా 209 సిక్సర్లు కొట్టాడు.

CSK తరపున గరిష్టంగా 220 IPL మ్యాచ్‌లు ఆడాడు.

కెప్టెన్‌గా, CSK తరపున గరిష్టంగా 5 IPL టైటిళ్లను గెలుచుకున్నాడు.

CSK కెప్టెన్‌గా అత్యధికంగా 212 IPL మ్యాచ్‌లు ఆడాడు.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధికంగా 218 సిక్సర్లు బాదిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు.

కెప్టెన్‌గా ధోనీ అత్యధికంగా 12 ఐపీఎల్ ప్లేఆఫ్‌లు ఆడాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ 50 లేదా అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇలా 22 సార్లు చేశాడు.

CSK తరఫున అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడు. చెన్నై తరపున అతను 316 ఫోర్లు బాదాడు.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. అతని పేరు మీద 4660 పరుగులు ఉన్నాయి.

కెప్టెన్‌గా అత్యధికంగా 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న ఉమ్మడి రికార్డు ధోనీ పేరిట ఉంది.

IPLలో కెప్టెన్‌గా అత్యధికంగా 226 మ్యాచ్‌లు ఆడిన రికార్డును ధోనీ కలిగి ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..