IPL 2024: కేఎల్ రాహుల్ టీమ్‌లోకి ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్.. ఈసారైనా లక్నోకు లక్ కలిసొచ్చేనా?
IPL 2024 ప్రారంభానికి ముందు లక్నో సూపర్‌జెయింట్స్ తమ కోచింగ్ స్టాఫ్‌లో చాలా మార్పులు చేసింది. గౌతమ్ గంభీర్, ఆండీ ఫ్లవర్ నిష్క్రమణ తర్వాత, కొత్త సిబ్బంది వచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో పేరు చేరింది. లక్నో ప్రాంఛైజీ కొత్త అసిస్టెంట్ సిబ్బంది పేర్లను ప్రకటించింది.

IPL 2024 ప్రారంభానికి ముందు లక్నో సూపర్‌జెయింట్స్ తమ కోచింగ్ స్టాఫ్‌లో చాలా మార్పులు చేసింది. గౌతమ్ గంభీర్, ఆండీ ఫ్లవర్ నిష్క్రమణ తర్వాత, కొత్త సిబ్బంది వచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో పేరు చేరింది. లక్నో ప్రాంఛైజీ కొత్త అసిస్టెంట్ సిబ్బంది పేర్లను ప్రకటించింది. ఫ్రాంచైజీ ఆస్ట్రేలియన్ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ వోగ్స్‌ను జట్టు సహాయక సిబ్బందిగా నియమించింది. వోగ్స్ మొదటి సారి ఒక IPL జట్టుకు సహాయక సిబ్బందిగా పని చేస్తున్నాడు. ఈ సీజన్‌లో, లక్నో కోచింగ్ సిబ్బందిలో గణనీయమైన మార్పులు చేసింది. ఆస్ట్రేలియా మాజీ కోచ్, ఓపెనింగ్ బ్యాటర్ జస్టిన్ లాంగర్‌ను జట్టు కోచ్‌గా నియమించారు. తర్వాత దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ అసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యారు. అతను ఇప్పుడు వోగ్ టీమ్ సపోర్టింగ్ స్టాఫ్‌లో చోటు సంపాదించాడు. వోగ్స్‌కు కోచింగ్‌లో గొప్ప అనుభవం ఉంది. అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియా కోచ్. అతని కోచింగ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా అనేకసార్లు మార్ష్ కప్, షెఫీల్డ్ షీల్డ్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లను గెలుచుకుంది.
ఇక ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్ (BBL)లో పెర్త్ స్కార్చర్స్‌కు కోచ్‌గా పనిచేశాడు ఆడమ్ వోగ్స్. ఆ జట్టు రెండుసార్లు జట్టు టైటిల్‌ను గెలుచుకోవడంలో సహాయపడ్డాడు. మరి ఐపీఎల్ ట్రోఫీని గెలవడానికి లక్నోకు వోగ్స్ ఎలా సహాయపడతాడో చూడాలి. లక్నోకు ఇది మూడో సీజన్. 2022లో ఐపీఎల్‌లో ఆ జట్టు అరంగేట్రం చేసింది. వోగ్స్ రాక జట్టుకు బోనస్ అని ఆ జట్టు ప్రధాన కోచ్ లాంగర్ అన్నారు. వోజెస్ గొప్ప కోచ్, వ్యక్తి. “మేము ఇంతకు ముందు కలిసి పనిచేశాము,” అని లాంగర్ చెప్పుకొచ్చారు.
May this stint be as extraordinary as his Test average 🫡🔥
Adam Voges joins the LSG support staff for #IPL2024 🇦🇺💙 pic.twitter.com/Oim9JtN7rx
— Lucknow Super Giants (@LucknowIPL) March 14, 2024
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, దేవదత్ పడిక్కల్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, యశ్ థాకూర్ , ప్రేరక్ మన్కడ్, అమిత్ మిశ్రా, మయాంక్ యాదవ్, షమర్ జోసెఫ్, మొహ్సిన్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, అర్షిన్ కులకర్ణి, శివమ్ మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్ విల్లీ, అష్టన్ టర్నర్, మహ్మద్ అర్షద్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








