KKR vs SRH IPL 2024 Final Match Report: కోల్‌కతాదే ఐపీఎల్ కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు

|

May 26, 2024 | 10:47 PM

IPL 2024 Final Match Report of Kolkata Knight Riders vs Sunrisers Hyderabad : ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఛాంపియన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ అవతరించింది. చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ టీమ్ హైదరాబాద్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది

KKR vs SRH IPL 2024 Final Match Report: కోల్‌కతాదే ఐపీఎల్ కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad
Follow us on

 

IPL 2024 Final Match Report of Kolkata Knight Riders vs Sunrisers Hyderabad : ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఛాంపియన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ అవతరించింది. చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ టీమ్ హైదరాబాద్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. 114 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా 2 వికెట్లు కోల్పోయి కేవలం 10.3 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ ను ఎగరేసుకుపోయింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ సునీల్ నరైన్ తొందరగా ఔటైనా వెంకటేశ్‌ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్, 4 ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో విజృంభించాడు. మరో ఓపెనర్ గుర్బాజ్‌ (39) కూడా రాణించాడు. శ్రేయస్‌ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లలో షాబాజ్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటయ్యింది.

ఇవి కూడా చదవండి

కోల్ కతా ఆటగాళ్ల విజయ దరహాసం..

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా మరియు వరుణ్ చక్రవర్తి.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ప్రకాష్ రాయ్, మనీష్ పాండే, నితీష్ రాణా, కేఎస్ భరత్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: పాట్ కమిన్స్ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్,  వాషింగ్టన్ సుందర్.

ముచ్చటగా మూడో సారి..

 

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..