Rajasthan Royals vs Royal Challengers Bengaluru Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ మంచి ఫామ్‌లో ఉంది. ఆ జట్టు 3 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింద. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై 20 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగుల తేడాత విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కనీసం ఈ మ్యాచ్ లో నైనా గెలిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని బెంగళూరు చూస్తోంది. ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఐపీఎల్ అభిమానులకు కనుల పండగే.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి ముందుగా ఆర్సీబీ బ్యాటింగ్కు దిగనుంది.
Toss time in Jaipur, we’ll be batting first tonight! 🪙
☝️ change to our Starting XI:
Saurav 🔁 Anuj#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB @qatarairways pic.twitter.com/t8v54gwrD8— Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2024
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కెమెరూన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరభ్ చౌహాన్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్. మయాంక్ దగర్
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ ప్రభుదేసాయి, మహిపాల్ లోమ్రోర్, హిమాన్షు శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, స్వప్నిల్ సింగ్
రాజస్థాన్ రాయల్స్: యస్సవి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బెర్గర్, యుజ్వేంద్ర చాహల్.
ఇంపాక్ట్ ప్లేయర్: రోవ్‌మన్ పావెల్, తనుష్ కొట్యాన్, కుల్దీప్ సేన్, శుభమ్ దూబే, అబిద్ ముస్తాక్.
Special game. Special cause. 💗
🗞️ Read all about our #PinkPromise and be #RRvRCB ready 👇
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.