IPL 2024: అనుకున్నదే అయ్యింది.. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్.. అధికారికంగా ప్రకటించిన ఫ్రాంఛైజీ
గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడెన్ మార్క్రామ్ జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఐడెన్ మార్క్రామ్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్‌లు ఆడగా కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో టోర్నీని కూడా ముగించింది. కాబట్టి ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నాయకత్వాన్ని మార్చబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి

అనుకున్నదే జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. దీని ప్రకారం, ఈ ఐపీఎల్‌లో SRH జట్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడెన్ మార్క్రామ్ జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఐడెన్ మార్క్రామ్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్‌లు ఆడగా కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో టోర్నీని కూడా ముగించింది. కాబట్టి ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నాయకత్వాన్ని మార్చబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆస్ట్రేలియా జట్టు విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచిన ప్యాట్ కమిన్స్‌కు పగ్గాలు అప్పజెప్పారు. కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ODI ప్రపంచకప్‌ను గెలుచుకుంది. దీంతో కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన రెండో బిడ్డింగ్. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఆటగాడిని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్రకటించడం విశేషం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మొత్తం 42 మ్యాచ్‌లు ఆడాడు పాట్ కమిన్స్. మొత్తం 379 పరుగులు, అలాగే 45 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్) అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిక్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్‌హాక్ ఫరూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, జాతవేద్ సుబ్రమణియన్.
ఆరేంజ్ ఆర్మీని నడిపించనున్న కమిన్స్..
#OrangeArmy! Our new skipper Pat Cummins 🧡#IPL2024 pic.twitter.com/ODNY9pdlEf
— SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024
Wishing you the happiest of birthdays Rahul bhai! 🫶#OrangeArmy, let’s show our ever-smiling Riser some love on this special occasion 🧡👇 pic.twitter.com/3lRodKNBey
— SunRisers Hyderabad (@SunRisers) March 2, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




