IPL 2023: హార్దిక్ చేతుల్లోనే కోహ్లీ భవితవ్యం.. ఒకటి గెలిస్తే ఆర్సీబీ ఇంటికే.! లెక్కలు ఇవిగో..

ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌ రేస్ రసవత్తరంగా సాగుతోంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి.. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరడమే కాదు..

IPL 2023: హార్దిక్ చేతుల్లోనే కోహ్లీ భవితవ్యం.. ఒకటి గెలిస్తే ఆర్సీబీ ఇంటికే.! లెక్కలు ఇవిగో..
Virat Kohli
Follow us
Ravi Kiran

|

Updated on: May 16, 2023 | 6:42 AM

ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌ రేస్ రసవత్తరంగా సాగుతోంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి.. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరడమే కాదు.. టాప్ 2లో చోటు కూడా ఖరారు చేసుకుంది. ఇక మిగతా 3 స్థానాల కోసం 4 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే డుప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాప్ 4 చేరాలంటే.. కచ్చితంగా ఈ రెండు పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇందులో మొదటిది.. మే 18న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. రెండోది.. గుజరాత్ టైటాన్స్. మే 21న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించడం దాదాపు ఖాయం.

ఎందుకంటే పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్‌లు మంగళవారం తలపడనున్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ఓడిపోతే.. అలాగే లీగ్‌లోని తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అటు నెట్‌ రన్‌రేట్ కూడా ముంబైది మైనస్‌లో ఉంది కాబట్టి.. కచ్చితంగా భారీ విజయం దక్కించుకోవాలి.

మరోవైపు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ ఓడిపోతే ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఎందుకంటే 13 పాయింట్లతో ఉన్న లక్నో జట్టు తదుపరి 2 మ్యాచ్‌ల్లో గెలిస్తే 17 పాయింట్లు వస్తాయి. ఒక మ్యాచ్‌లో ఓడిపోతే 15 పాయింట్లతో 4వ స్థానంలో ఉంటుంది. బెంగళూరు జట్టు తదుపరి 2 మ్యాచ్‌లలో గెలిస్తే 16 పాయింట్లు సాధిస్తుంది. ముంబై ఇండియన్స్(16 పాయింట్లు), పంజాబ్ కింగ్స్(16 పాయింట్లు) కూడా సేమ్ ఉన్నా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా చూసుకుంటే ఆర్సీబీనే ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే.. ఐపీఎల్ లీగ్ దశలో ఆర్సీబీ చివరి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. అసలే రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న గుజరాత్‌ను ఓడించాలంటే.. ఆర్సీబీకి కత్తి మీద సామే. దీంతో కోహ్లీ భవితవ్యం కాస్తా హార్దిక్ చేతుల్లో ఉందన్న మాటే. బెంగళూరు ఈసారైనా కప్పు గెలుస్తుందో లేక అస్సాం చేస్తుందో చూడాలి.