IPL 2023: అదే జరిగితే.. ఈసారి ధోని, రోహిత్‌ల మధ్య ఫైనల్ ఫైట్..!
ఈ ఐపీఎల్ సీజన్‌లో లీగ్ స్టేజి చివరికి వచ్చినా.. ఇంకా ప్లేఆఫ్స్ చేరే జట్లు ఏవి అన్నది క్లారిటీ లేదు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ చేరినా..
ఈ ఐపీఎల్ సీజన్‌లో లీగ్ స్టేజి చివరికి వచ్చినా.. ఇంకా ప్లేఆఫ్స్ చేరే జట్లు ఏవి అన్నది క్లారిటీ లేదు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ చేరినా.. మిగతా 3 స్థానాల కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి. అందులో ధోని సారధ్యం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లూ మొదటి ఫేజ్‌లో పరాజయాలు చవిచూసినా.. రెండో ఫేజ్‌లో పుంజుకుని వరుస విజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవం చేసుకున్నాయి. ఇక చెబుతోన్న గణాంకాల బట్టి ఈ రెండు జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్‌లో ఉండే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఇలా జరిగితే.. ఈసారి ముంబై, చెన్నై మధ్య ఫైనల్ జరుగుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఆ లెక్కలేంటో చూసేద్దామా..!
ముంబై ఇండియన్స్‌కి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి లక్నోతో.. మరొకటి హైదరాబాద్‌తో ఉంది. లక్నోతో మ్యాచ్ కొంత ఉత్కంఠభరితంగా సాగొచ్చు. కానీ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై సునాయాసంగా గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ముంబై ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే.. 18 పాయింట్లతో టాప్ 2లో నిలుస్తుంది. మరోవైపు ఒకవేళ గుజరాత్ చివరి మ్యాచ్‌లో ఓడి.. చెన్నై తమ లాస్ట్ మ్యాచ్ గెలిస్తే.. క్వాలిఫైయర్స్‌లో ముంబై, చెన్నై తలబడే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ధోని జట్టు బౌలింగ్, కెప్టెన్ కూల్ నిర్ణయాలు చెన్నై జట్టుకు ప్లస్ పాయింట్.. ఈ రెండు జట్ల కూర్పును బట్టి.. క్వాలిఫైయర్ 2లో ముంబై, చెన్నై తలబడే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదే జరిగితే మిగిలిన జట్లు టైటిల్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనని చెబుతున్నారు.