IPL 2023: సన్‌రైజర్స్ కోసం హైదరాబాద్ సిద్ధం.. ‘బౌలర్ vs బ్యాట్స్‌మ్యాన్’ తుది జట్టు వివరాలివే..
ఐపీఎల్ సీజన్ 16 కోసం హోం గ్రౌండ్ హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆరెంజ్ ఆర్మీ బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 15వ సీజన్‌లో విఫలమైన సన్‌రైజర్స్, ఫైనల్ రన్నరప్ అయిన రాజస్థాన్ టీమ్ మధ్య
ఐపీఎల్ సీజన్ 16లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. హోం గ్రౌండ్ హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆరెంజ్ ఆర్మీ బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 15వ సీజన్‌లో విఫలమైన సన్‌రైజర్స్, ఫైనల్ రన్నరప్ అయిన రాజస్థాన్ టీమ్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే సీజన్ 16 కోసం ఐపీఎల్ కెప్టెన్‌గా సెలెక్ట్ అయిన ఐడాన్ మార్క్రమ్ తొలి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడం లేదు. దీంతో తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీని టీమిండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నడిపించనున్నాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ను సంజూ శామ్సన్ నడిపిస్తున్న విషయం తెలిసిందే. అంటే ఈ మ్యాచ్ టీమిండియా యువ బ్యాట్స్‌మ్యాన్‌కి, అలాగే ఆ టీమ్‌లోని సీనియర్ బౌలర్‌కి మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అని చెప్పుకోవాలి.
ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కేన్‌విలియమ్సన్ వంటి ప్లేయర్లను విడుదల చేసి, మయాంక్ అగర్వాల్‌ని తీసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సారి మయాంక్ అగర్వాల్ హైదరాబాద్ టీమ్ కోసం ఏ స్థాయిలో రాణిస్తాడో వేచి చూడాలి. మరోవైపు హైదరాబాద్ టీమ్‌లో తాత్కలిక కెప్టెన్ భూవీ, అభిషేక్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, ఉమ్రాన్ మాలిక్ వంటి కీలక ప్లేయర్లు ఉండడం దానికి బలమని చెప్పుకోవాలి. మరోవైపు జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మేయర్, జాసన్ హోల్డర్, రియాన్ పరాగ్ , రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, కెప్టెన్ సంజూ శామ్సన్ వంటివారు రాజస్థాన్‌కు అండగా ఉన్నారు.
Less than 2⃣4⃣ hours for the ? to blaze in Uppal again ?
LET’S. GET. STARTED. ??#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/LEbuo3RIyZ
— SunRisers Hyderabad (@SunRisers) April 1, 2023
జట్టు వివరాలివే.. (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్(WK), వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్(c), ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ఒబెడ్ మెక్‌కాయ్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..