శివలీల గోపి తుల్వా |
Updated on: Apr 01, 2023 | 1:15 PM
గ్యాస్ సిలిండర్ ఎరువు రంగులో ఉంటుంది. ఇలా ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందని మీరెప్పుడైనా గమనించారా? అందుకు కారణం లేకపోలేదు.
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లో మండే వాయువు ఉంటుంది. అందుకే సిలిండర్ అంటేనే ప్రమాదకరం. వినియోగదారుల భద్రత కోసం గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఎందుకంటే ఎరుపు రంగును హెచ్చరిక చిహ్నంగా భావిస్తారు.
ఇదే కాకుండా గ్యాస్ సిలింగడర్ రెండ్ కలర్‌లో ఉండడం సైన్స్‌తో కూడా ముడిపడి ఉంది. ఎరుపు రంగును దూరంగా ఉన్నా సులభంగా గుర్తించవచ్చు. ఇతర రంగులను గుర్తించడం కొంత కష్టంగా ఉన్నా ఎరుపు రంగులను గుర్తించడం సులభం.
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ సిలిండర్‌కు ఎరుపు రంగును వేస్తుంది. ఎరుపు రంగు అనేది ప్రమాదాలకు చిహ్నం కనుక దూరం నుంచి కూడా ఎరుపు రంగును గుర్తించవచ్చు. అందుకే సిలిండర్‌కు ఈ రంగు వేయడానికి కారణమని తెలుస్తోంది.
ఇంకా గ్యాస్ వాసన రావడం వెనుక కూడా ఓ రహస్యం దాగి ఉంది. సిలిండర్‌ను తయారు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ సమయంలో ఎల్‌పీజీకి వాసన ఉండదు. దీనికి మండే స్వభావం ఉంటంది. వాసన లేకపోతే ఎల్‌పీజీ లీక్ అవుతుందా? లేదా? అని గుర్తించడం కష్టం అవుతుంది.
ఫలితంగా ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రమాదాలను నివారించడానికి ఇందులో ఇథైల్ మోర్కాంప్టన్ కలిపి వాసన వచ్చేలా చేస్తారు. అలాంటప్పుడు గ్యాస్ లీకైతే వెంటనే వాసన వస్తుంది. దీని వల్ల ప్రమాదం జరుగకుండా జాగ్రత్త పడవచ్చు.