AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fight Video: అసలేం జరుగుతోంది..? రోడ్డుపైనే పిచ్చపిచ్చగా తన్నుకున్న అమ్మాయిలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక అమ్మాయితో తన్నుకుంటున్నారు. మళ్లీ తమలో తామే ఒకరిని ఒకరు ఆపుకుని కూడా తిరిగి ఒంటరిగా ఉన్న ఆమెను కొడుతున్నారు. ఈ గొడవ ఎక్కడ ఎందుకు..

Fight Video: అసలేం జరుగుతోంది..? రోడ్డుపైనే పిచ్చపిచ్చగా తన్నుకున్న అమ్మాయిలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Girl Fighting Each Other
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 01, 2023 | 12:34 PM

ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో స్నేహితులకు, స్నేహితుల మధ్య జరిగిన సరదా గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా ఉండటం శరామామూలే. అదే కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొందరు అమ్మాయిలు తమలో తాము కొట్టుకుంటున్నారు. మళ్లీ తమలో తామే ఆపుకుని కూడా తిరిగి కొడుతున్నారు. ఈ గొడవ ఎక్కడ ఎందుకు జరిగిందో తెలియదు కానీ నెటిజన్లకు వినోదాల పంటగా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకోవడంతో పాటు ‘భలే ఆనందంగా ఉంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

thugs_ofinsta అనే ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ అయిన వీడియోలో ముందుగా ఇద్దరు అమ్మాయిలు కలిసి మరో యువతిని కొడుతుంటారు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి అయితే ‘నువ్వు ఆగు నేను కొడతా’ అన్నట్లుగా పక్కన ఉన్న అమ్మాయిని కాసేపు వారించి మళ్లీ కొడుతుంది. ఇక అక్కడే ఉన్న మరో ఇద్దరు యువతులు ‘మనకేందుకు పోదాం పదా’ అనుకున్నట్లుగా అక్కడ నుంచి కదిలిపోతారు. దీనికి సంబంధించిన దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు. వైరల్ అవుతున్న అమ్మాయిల గొడవకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి.. 

ఇవి కూడా చదవండి

మరోవైపు వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ తన ఫ్రెండ్‌ని కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేసి ‘ఎందుకయ్యా నీ గాల్‌ఫ్రెండ్స్ అలా కొట్టుకుంటున్నారు..’ అని రాసుకొచ్చాడు. అలాగే మరో నెటిజన్ ‘మీరు ఇంకా ఇంకా తన్నుకోవాలని దేవుడిని కోరుకుంటున్నా’ అని కామెంట్ చేశాడు. ఇంకొకరు అయితే ‘ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్.. ఇంకా పెట్టు’ అని తెలిపాడు. ఇలా ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 15 లక్షల వీక్షణలు, 14 వేల లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..